ETV Bharat / bharat

వారు లంచాలు తీసుకుని కుక్కల్లా నిద్రపోతున్నారు: హోంమంత్రి - కర్ణాటక హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర

Aaraga Jnanendra: పశువుల అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు కర్ణాటక హోంమంత్రి. లంచాలకు అలవాటు పడి.. పశువులను తరలిస్తుంటే కుక్కల్లా నిద్రపోతున్నారని వ్యాఖ్యానించారు.

Aaraga Jnanendra
అరాగ జ్ఞానేంద్ర
author img

By

Published : Dec 4, 2021, 5:07 PM IST

Aaraga Jnanendra: పశువుల అక్రమ రవాణా కట్టడిలో విఫలమైనందుకుగాను పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచం తీసుకుంటూ శునకాల్లా నిద్రపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే వారు ఎలాంటి శిక్ష అనుభవించకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది.

"పశువులను తరలిస్తున్న వారు తరచూ అక్రమ రవాణాలకు పాల్పడేవారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ మీరు లంచాలు మరిగి కుక్కల్లా నిద్రపోతున్నారు. మీకు ఆత్మగౌరవం అనేది ఉండాలి. ఇప్పటివరకు నేను ఈ విషయంపై ఏం మాట్లాడలేదు. కానీ నేను హోంమంత్రిగా కొనసాగాలా వద్దా? మొత్తం పోలీస్​ వ్యవస్థే కుళ్లిపోయింది. మేము జీతాలు ఇస్తున్నా మీరు వాటితో సంతృప్తి చెందక లంచాలకు అలవాటు పడ్డారు."

--ఫోన్​కాల్​లో పోలీసులపై మంత్రి జ్ఞానేంద్ర

ఈ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు మంత్రి జ్ఞానేంద్ర. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం అందడం వల్లే ఆగ్రహంలో అలా మాట్లాడానని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం అవినీతికి పాల్పడే పోలీసుల గురించేనని, అందరిపైనా కాదని స్పష్టం చేశారు.

"ఇటీవల శివమొగ్గ జిల్లాలో పశుఅక్రమ రవాణాదారులను కొందరు జంతుప్రేమికులు అడ్డుకుంటే వారి మీద నుంచి స్మగ్లర్ల వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నన్ను కలచివేసింది. గోవధపై నిషేధం విధించిన తర్వాత కూడా రాష్ట్రంలో అక్రమ రవాణా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది."

--జ్ఞానేంద్ర, హోంమంత్రి

మల్నాడ్​ ప్రాంతంలో స్మగ్లర్లు పశువుల యజమానులను కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి పశువులను బలవంతంగా తరలిస్తున్నట్లు హోంమంత్రి ఆరోపించారు.

ఇదీ చూడండి : 1,123 కిలోల ఉల్లి అమ్మితే లాభం రూ.13- రైతు బతికేదెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.