High Court Warning to Educational Officials: విద్యాశాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. తాము ఆదేశించిన ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని ఆల్టిమేటం ఇచ్చింది. 25శాతం కోటాతో ప్రవేశం కల్పించిన విద్యార్థుల జాబితా ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కార కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలని న్యాయవాది యోగేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపి 25 శాతం సీట్లు ఇవ్వాలని 2022లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదంటూ మరోసారి న్యాయవాది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. 90 వేల సీట్లు ఉంటే కేవలం 9064 సీట్లు మాత్రమే పేదలకు కేటాయించారని న్యాయవాది యోగేశ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం కేటాయించిన సీట్ల వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: