AP HC Hearing on Additional Conditions in Chandrababu Interim Bail: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌లో అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు గతంలో విధించిన షరతులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టులు తీర్పు వెలువరించింది.
ర్యాలీల్లో పాల్గోనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తీర్పును వెలువరించింది మీడీయా సమావేశాలు మాత్రమే కాకుండా చంద్రబాబు రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని గుర్తు చేసింది.
Chandrababu Petitions in AP High Court: అప్పటివరకూ చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను.. హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ గతంలో అనుబంధ పిటిషన్ వేయగా.. హైకోర్టు గతంలో విచారణ జరిపి తీర్పు ఈ రోజు వెలువరించింది.
స్కిల్ కేసులో అక్రమ ఆరోపణలతో అరెస్టైనా చంద్రబాబుకు.. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత నెల 30న విచారణ చేపట్టింది. తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం తర్వాత రోజున తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఈ తీర్పులో చంద్రబాబుకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ, కొన్ని షరతులు విధిస్తూ మధ్యంతర బెయిల్‌కు అనుమతినిచ్చింది. వైద్య సహాయం కోసం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్‌పై విచారణ నవంబరు 10న జరుపుతామని కోర్టు తెలిపింది.
- మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు విధించిన కొన్ని షరతులు:
- లక్ష రూపాయలతో కూడిన పూచీకత్తును చంద్రబాబు సమర్పించాలి. అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ ఇప్పించాలి.
- చంద్రబాబు కోరుకున్న ఆసుపత్రిలో ఆయన సొంత ఖర్చులతోనే వైద్యం చేయించుకోవాలి.
- బెయిల్ ముగిసిన అనంతరం.. జైలులో సరెండర్‌కు ముందు చంద్రబాబు తాను చేయించుకున్న చికిత్స వివరాలతో పాటు ఆసుపత్రి వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్ కవర్‌లో సమర్పించాలి.
- జైలు సూపరింటెండెంట్ వాటిని సీల్డ్ కవర్‌లోనే ట్రయల్ కోర్టుకు అందించాలి.
- స్కిల్ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రత్యక్షంగా.. పరోక్షంగా బెదిరింపులకు పిటిషనర్ దిగకూడదు. అంతేకాకుండా లొంగదీసుకునే చర్యలకు కూడా పూనుకోరాదు.
- చంద్రబాబు చికిత్స అనంతరం నవంబర్ 28వ తేదీన.. సాయంత్రం 5 గంటలకు స్వయంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్ సమక్షంలో లొంగిపోవాలి.
చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలను ఎస్కార్ట్‌గా ఉంచాలని ప్రభుత్వం భావించింది. అందుకు ప్రభుత్య అభ్యర్ధనపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.
చంద్రబాబు విడుదలతో దుర్గమ్మ సన్నిధికి అమరావతి రైతుల పాదయాత్ర - నర్సాపురంలో టీడీపీ నేతలు