AP CM Jagan Meets KCR : బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (AP CM Jagan) పరామర్శించారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన 11.30నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జగన్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. తరువాత బంజారాహిల్స్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ ఇంటికి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ (KTR) , బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసిన జగన్ ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. అనంతరం అరగంటకు పైగా జగన్, కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, త్వరలో ఏపీ సహా లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
ఆసుపత్రిలో కేసీఆర్ పుస్తక పఠనం - పరామర్శించిన పలువురు ప్రముఖులు
కాగా డిసెంబరు 7వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో కాలు జారి కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయణ్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్‌ను (KCR) పరిశీలించిన వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
A Man Run over CM Jagan Convoy : ఏపీ సీఎం హైదరాబాద్ రానున్నసమాచారంతో బేగంపేట విమానాశ్రయంలో ఓ హల్‌చల్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఆయన వాహనం వెనుక పరుగెత్తిన సతీష్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి వెళుతున్న కాన్వాయ్‌లో సీఎం వాహనం వెంట నినాదాలు చేస్తూ పరుగులు తీశాడు. ఇదేకాకుండా ఒకదశలో పోలీసులతో దురుసుగా మాట్లాడారు. పోలీసులు ఆయన్ను ఆరా తీయగా, తాను సీఎం జగన్‌కు తెలుసని, తాను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బౌన్సర్ సర్వీసు నడుపుతున్నానని చెప్పారు. తన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తన తండ్రి కానిస్టేబుల్ అని చెప్పుకొచ్చారు. జడ్ ఫ్లస్ సెక్యూరిటీ నడుమ ఉన్న సీఎం హోదా ఉన్న నేత వాహనం వెంట అరుపులతో పరిగెత్తడం ఎంత వరకు సబబు అని సతీష్‌ను మందలించారు. ఏమైనా పని ఉన్నా లేదా అభిమానం ఉంటే పోలీసుశాఖ అనుమతి తీసుకుని అమరావతిలోని సచివాలయం లేదా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి అభ్యర్థన విన్నవించుకోవాలని ఆయనకు తెలిపారు. ఇలా వ్యవహరించడం తగదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పరిశీలించి అవసరమైతే కేసు నమోదు చేస్తామని సీఐ జె.భాస్కర్ తెలిపారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను: రేవంత్ రెడ్డి