ETV Bharat / bharat

'బలగాల ఉపసంహరణపై భారత్​- చైనా ఏకాభిప్రాయం' - వాస్తవాధీన రేఖ

లద్దాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందంలో భారత్ ఎలాంటి షరతులకు అంగీకరించలేదన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత పరిస్థితులు కొనసాగించేందుకు భారత్​ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

Any impact on peace, tranquillity on LAC will adversely affect bilateral ties: Rajnath Singh
'అంగుళం భూమి కూడా కోల్పోలేదు'
author img

By

Published : Feb 11, 2021, 11:33 AM IST

Updated : Feb 11, 2021, 12:42 PM IST

తూర్పు లద్దాఖ్​ సరిహద్దుల్లోని పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే భారత్​-చైనా ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. దీని ప్రకారం.. ఇరు దేశాలు తమ బలగాలను విడతల వారీగా, సమన్వయంతో వెనక్కి పంపనున్నాయని వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై రాజ్యసభలో ఈమేరకు ప్రకటన చేశారు రాజ్​నాథ్​.

లద్దాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభన తొలగించేందుకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించడం, పెట్రోలింగ్​ వంటి సమస్యలున్నాయని తెలిపారు. పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణపై రానున్న రెండు రోజుల్లో కమాండర్​ స్థాయిలో చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పాంగాంగ్​ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్​ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయన్న ఆయన.. భారత బలగాలు ఫింగర్​ 3 వద్ద ఉంటాయని పేర్కొన్నారు.

జవాన్లు దేనికైనా రెడీ

భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మన భద్రతా దళాలు రుజువు చేశాయన్నారు. చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు.

"వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత పరిస్థితులు కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నాం. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని భారత్​ నొక్కిచెబుతోంది. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మన భద్రతా దళాలు నిరూపించాయి"

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

వాస్తవాధీన రేఖ వెంబడి ప్రశాంత వాతావరణం దెబ్బతింటే భారత్​-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తాయన్నారు రాజ్​నాథ్​​. ఇరు దేశాల సమన్వయంతోనే సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వెనక్కి తగ్గిన చైనా- బలగాల ఉపసంహరణ ప్రారంభం!

Last Updated : Feb 11, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.