ETV Bharat / bharat

చీనాబ్​ రైల్వే వంతెన ఆర్చ్​ నిర్మాణం పూర్తి - world's highest bridge

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వారధిగా రికార్డలకెక్కిన చీనాబ్‌ వంతెన నిర్మాణంలో అత్యంత కీలకఘట్టం పూర్తయింది. కీలకమైన మైలురాయిగా భావించే ఉక్కువంపు లేదా స్టీల్‌ ఆర్చ్‌ నిర్మాణం పూర్తయింది. చీనాబ్‌ వంతెన నిర్మాణంలో.. ఈ భాగాన్ని అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావిస్తారు.

another milestone of Indian railways last arch of Chenab bridge completed
చీనాబ్​ రైల్వే వంతెన
author img

By

Published : Apr 5, 2021, 7:59 PM IST

కశ్మీర్​ లోయలోని చీనాబ్​ నదిపై తలపెట్టిన రైలు వంతెన ఆర్చ్​ పనులు పూర్తి అయ్యాయి. కత్రా నుంచి బనిహాల్‌ మధ్య 111కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మాణంలో అత్యంత ప్రధానమైన స్టీల్‌ ఆర్చ్‌ నిర్మాణం పూర్తయింది. ఉత్తర రైల్వేకు ఇదో చారిత్రక ఘట్టమని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన ఏడాది కాలంలో పూర్తవుతుందని తెలిపారు. 1.3 కిలోమీటర్లు పొడువైన ఈ వంతెనను.. ఉధంపుర్​-శ్రీనగర్​-బారాముల్లా రైల్వే లైన్​ ప్రాజెక్టులో భాగం రూ.1,486 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

2002లో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నిలిచిపోయాయి. మళ్లీ 2017 జులైలో ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ఈ ప్రాజెక్టును 2019 చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే 2018లో కాంట్రాక్టు సమస్యల కారణంగా జాప్యం కాగా.. కరోనా​ వల్ల మరింత ఆలస్యమైంది.

చీనాబ్​ వంతెన ఫీచర్లు..

  • ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. నది మట్టానికి 359 మీటర్లు ఎత్తులో ఉంది. పారిస్​లోని ఐఫిల్​ టవర్​ కన్నా 35 మీటర్లు ఎత్తైనది. ఈ ఆర్చ్​ మొత్తం బరువు 10,619 మెట్రిక్​ టన్నలు.
  • ఈ ఆర్చ్​లో ఉక్కు పెట్టెలు ఉంటాయి. వంతెనకు స్థిరత్వాన్ని అందించడానికి వీటిని కాంక్రీటుతో నింపుతారు.
  • ఈ వంతెన నిర్మాణానికి ఉపయోగించే ఉక్కు 10 డిగ్రీల సెంటిగ్రేడ్​ నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటుంది. దీనిని గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకునేలా రూపొందించారు.
  • ఈ ప్రాంతంలో ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకుని దీని ప్రణాళిక రూపొందించారు. ఈ వంతెన దేశంలోనే అత్యధిక తీవ్రత కలిగిన వీ-జోన్​ భూకంపాలను కూడా తట్టుకోలదు.

ఇదీ చూడండి: రఫేల్ ముడుపులపై రాజకీయ రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.