ETV Bharat / bharat

Another Leopard Trapped in Cage at Tirupati: తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత.. - Animals Attack on Devotees in Tirupati

Another Leopard_Trapped_in_Cage_at_Tirupati

author img

By

Published : Aug 17, 2023, 6:48 AM IST

Updated : Aug 17, 2023, 4:44 PM IST

06:46 August 17

బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన చిరుత

Another Leopard Trapped in Cage at Tirupati: తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

Another Leopard Trapped in Cage at Tirupati: తిరుమల నడకదారిలో అటవీశాఖ అధికారుల చేతికి మరో చిరుత పులి చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో ఆరేళ్ల చిన్నారిని చిరుత బలి తీసుకుంది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై.. 4 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ట్రాప్ కెమెరాలనూ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ చిరుత చిక్కగా.. బాలికపై దాడిచేసిన ప్రాంతమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో ఈవాళ మరో చిరుత చిక్కింది. వారం రోజుల వ్యవధిలో బోనులో రెండు చిరుతలు చిక్కడంతో అధికారులు.. ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా తిరుపతిలో చిరుతల సంచారంతో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు.

Cheetah Died under Suspicious Circumstance: పొలాల్లో చిరుత కళేబరం.. అటవీ అధికారులకు సమాచారమిచ్చిన రైతు

ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చిరుత సంచారం..
ఇటీవల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చిరుతను చూసిన విద్యార్థులు ఆందోళన చెంది.. పరుగులు తీశారు. వేద విశ్వవిద్యాలయంలోనూ రాత్రి సమయంలో చిరుత సంచరించినట్లు గుర్తించారు. దీనిపై అటవీ అటవీశాఖకు విద్యార్థులు సమాచారం అందించగా.. అధికారులు దీనిపై పరిశీలనలు చేపట్టారు.

తిరుమలలో చిరుతల సంచారం..
అలిపిరి నడక మార్గంలో ఇటీవల ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి బలిగొన్న ఘటనతో.. ఆలయానికి వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వీటితో పాటు ట్రాప్ కెమెరాల్లో మరికొన్ని చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు నమోదవటంతో బిక్కుబిక్కుమంటున్నారు. దీంతోపాటు బోనులో వారం రోజుల వ్యవధిలో రెండు చిరుతలు చిక్కడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Leopard Trapped in Cage at Tirumala: తిరుమలలో బోనులో చిక్కిన చిరుత.. మరో ఐదు సంచారం..

చిన్నారిపై చిరుత దాడి..
నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్ అనే వ్యక్తి కుటుంబం ఆగస్టు 11న.. పోతిరెడ్డిపాలెం నుంచి శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. సుమారు రాత్రి 8 గంటల సమయంలో వారు అలిపిరి నుంచి కాలినడకన బయల్దేరారు. రాత్రి 10:30 గంటల సమయంలో వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపానికి చేరుకోగా.. తమతో పాటు వచ్చిన చిన్నారి లక్షిత అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగణంలో వెతకసాగారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో గాలింపు చర్యలకు వీలుకాక.. భద్రతా సిబ్బంది ఉదయాన్నే చిన్నారిపై గాలింపు చర్యలు చేపట్టింది. ఉదయం ఏడు గంటల సమయంలో అటవీ శాఖ అధికారులకు.. సగం తిన్న స్థితిలో ఉన్న చిన్నారి మృతదేహం లభ్యమైంది.

Animals Attack on Devotees in Tirupati: వెంకన్న దర్శనం.. అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ప్రాణసంకటం..!

తిరుమలలో భక్తులపై ఆంక్షలు..
తిరుపతి నుంచి తిరుమల నడకదారుల్లో అడవి జంతువుల దాడి ఘటనల నేపథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు భక్తులపై ఆంక్షలు విధించింది. 2 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తామని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. పెద్దలను రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామన్నారు. అలాగే ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవిలతో కలిసి కరుణాకర్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు.

Girl killed in Leopard Attack: తిరుమల నడకదారిలో తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న చిరుత

Last Updated : Aug 17, 2023, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.