ETV Bharat / bharat

దేవుడి ప్రసాదాలు లూటీ- అలా చేస్తే సమస్త రోగాలు మాయం! 350 ఏళ్లుగా ఇదే ఆచారం - దేవుడి ప్రసాదం దొంగిలింత

Annakoot Festival In Rajasthan : స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాలను.. అక్కడి ప్రజలే దోచేస్తారు. ఇలా చేయటమే ఓ పండుగలాగా జరుపుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారో.. ఎక్కడ చేస్తారో? తెలుసుకుందామా మరి.

Annakoot Festival In Rajasthan
Annakoot Festival In Rajasthan
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 5:59 PM IST

దేవుడి ప్రసాదాలు లూటీ- అలా చేస్తే సమస్త రోగాలు మాయం! 350 ఏళ్లుగా ఇదే ఆచారం

Annakoot Festival In Rajasthan : అందరూ చూస్తుండగానే చాలా మంది వచ్చి ఆలయంలోని ప్రసాదాలను కుండలు, సంచులతో దోచుకెళ్లటం చూస్తున్నారు కదా! ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది వచ్చి దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాన్ని లూటీ చేస్తున్నారు. ఇలా చేయటాన్ని ఓ పండుగలాగా జరుపుకుంటున్నారు రాజస్థానీలు. దేవుని దగ్గర ప్రసాదాలు పెట్టడం.. అక్కడ గిరిజనలు వచ్చి లూటీ చేయటం ఇలా గత 350 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అదే రాజ్​సమంద్​లోని శ్రీనాథ్​జీ ఆలయంలో జరిగే అన్నకూట్​ పండుగ.

Annakoot Festival In Rajasthan
ప్రసాదాలను దొంగిలిస్తున్న గిరిజనులు

ఈ పండుగను రాజ్​సమంద్​ ప్రజలు దీపావళి తరవాత రోజున ఘనంగా నిర్వహించుకుంటారు. శ్రీనాథ్​జీ, విఠల్​నాథ్​జీ, లాలన్​కు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడతారు. వాటిని రాత్రి 11 గంటల సమయంలో రాజ్​సమంద్​ జిల్లా గిరిజనలు వచ్చి దోచుకుంటారు. వీటికోసం తమ ఇళ్ల నుంచి సంచులను తెచ్చుకుని.. బుట్టలు, కుండలలో ఉంచిన ప్రసాదాన్ని దోచుకుంటారు. అన్నకూట్ లూటీ సంప్రదాయాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కుడా వందల సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ యువరాజ్ అన్నారు.

"హిందూ సంప్రదాయం ప్రకారం నాలుగు వర్ణాల ప్రజల ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తేనే ఈ అన్నకూట్​ మహోత్సవం పూర్తవుతుంది. ఆదివాసి ప్రజలు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే దేవునికి ఇష్టం. గిరిజనులు ఈ ప్రసాదాలను ఔషధంగా భావిస్తారు. నైవేద్యాలను తీసుకుంటే సమస్త రోగాలు నయమవుతాయని నమ్ముతారు. "
-చిరంజీవ్ విశాల్ బావా, ఆలయ యువరాజ్

బంధువులకు కూడా ప్రసాదాల పంపిణీ..
Devotees Prasadam Theft Festival : గిరిజన సామాజిక వర్గానికి చెందిన పురుషులు, మహిళలు ఆలయంలోకి వచ్చి.. దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాలు, బియ్యం దోచుకెళ్తారు. వీటిని తమ బంధువులకు కూడా ఇస్తారు. గిరిజనులు ఈ బియ్యాన్ని తమ దగ్గర ఉంచుకోవటం వల్ల ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కలుగవని వారి నమ్మకం. ఎంతో ఆనందంగా ఈ పండుగను ప్రతి ఏటా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఈ అన్నకూట్​ మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.

Annakoot Festival In Rajasthan
కుండలలో ప్రసాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.