ETV Bharat / bharat

పిచ్చుకల రక్షణ కోసం 'వీర' ప్రయత్నం

మారుతున్న వాతావరణ పరిస్థితులు, మానవ చర్యలు పిచ్చుకల జీవనానికి ప్రమాదకరంగా మారాయి. ఫలితంగా వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్​కు చెందిన వీరమహేష్​ కలత చెంది... ఆవాస క్షీణతే అందుకు కారణమని గుర్తించాడు. ఈ చిట్టిగువ్వలను ఎలాగైనా రక్షించాలని సంకల్పించాడు.

author img

By

Published : Nov 9, 2020, 11:49 AM IST

Andhra Pradesh based person Veera Mahesh trying to Save Sparrows
కనుమరుగవుతున్న కిచకిచ- రక్షణ కోసం చకచక
పిచ్చుకల రక్షణ కోసం 'వీర' ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ ప్రైవేటు అధ్యాపకుడు వీరమహేష్. చిన్నప్పుడు ఇంటిచూరులో గూళ్లు కట్టుకుని, నివాసముండే పిచ్చుకలను బాగా ఇష్టపడేవాడు. క్రమంగా వాటి సంఖ్య తగ్గడం చూసి, కలత చెందిన మహేష్... ఆవాస క్షీణతే అందుకు కారణమని గుర్తించాడు. జంగారెడ్డిగూడెంను పిచ్చుకల పట్టణంగా మార్చాలని సంకల్పించుకున్నాడు. చెక్కతో చిన్న గూళ్లను తయారుచేసి, ఇంటింటికీ సరఫరా చేశాడు.

"థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అనే సూత్రాన్ని ఆదర్శంగా తీసుకుని, పిచ్చుకలకు ఆవాసాలు కల్పించడం ద్వారా వాటి సంఖ్యను పెంచవచ్చు అని ప్రాక్టికల్గా రుజువు చేశాను. చెక్కపెట్టెలతో చేసిన నిర్మాణాలను ఇంటింటికీ సరఫరా చేశాను. సంవత్సరానికి సరాసరిన 2-3 సార్లు అవి సంతతిని వృద్ధి చేసుకుంటాయి."

-వీరమహేష్, పిచ్చుకల ప్రేమికుడు

కృత్రిమ పిచ్చుకగూడు ఇచ్చేముందు.. ప్రతి ఇంటి యజమాని నుంచి అనుమతి పత్రం తీసుకుంటాడు మహేష్. అంతటితో అయిపోయింది అనుకోకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తాడు. ఇప్పటి వరకు 400 పైగా గూళ్లు పంపిణీ చేశాడు. వాటిని పిచ్చుకలు ఆవాసాలుగా మార్చుకుని, సంతతి వృద్ధి చేసుకొనేలా తగిన చర్యలు తీసుకుంటున్నాడు.

"నేనే స్వయంగా గూళ్లు తయారుచేసి, ఇంటింటికీ అమర్చాను. శాస్త్రీయ పద్ధతిలో ప్రతి సంవత్సరం ప్రతి గూటినీ మానిటరింగ్ చేస్తూ వచ్చాను. ప్రస్తుతం మా కాలనీలో దాదాపు 300 పిచ్చుకలను లెక్కించాను."

-వీరమహేష్, పిచ్చుకల ప్రేమికుడు

ప్రస్తుతం మచిలీపట్నంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహేష్....వారాంతాల్లో ఇంటికి వచ్చి, పిచ్చుకల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాడు. 2009లో ఇంటివద్దే 2 కృత్రిమ గూళ్లతో ప్రయోగాత్మకంగా ప్రారంభించాడు. మూడేళ్లలో వాటి సంతతి పదింతలవడం గమనించాడు. అప్పటినుంచి ఈ కార్యక్రమం విస్తృతం చేశాడు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన 97శాతం గూళ్లలో పిచ్చుకలు ఆవాసాలు ఏర్పరచుకున్నాయి.

ముంబయిలోని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో పక్షులపై పరిశోధన చేసిన మహేష్... పిచ్చుకల ఆవాసాల ప్రమాదంపై పీహెచ్​డీ చేస్తున్నాడు. వాటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల సాయంతో ర్యాలీలు నిర్వహించాడు. పిచ్చుకలు మునుపటి కంటే ఎక్కువగా కనిపిస్తుండటం వల్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"చిన్నచిన్న పెట్టెలు తయారుచేసి, ఇంటింటికీ ఉచితంగా సరఫరా చేస్తున్నాడు. పర్యావరణాన్ని కాపాడడానికి, పిచ్చుకల సంపద పెంచడానికి ఎంతో కష్టపడుతున్నాడు."

-నాగేశ్వరరావు, స్థానికుడు

"మొదట్లో అందరూ ఇదేంటి? ఇలా చేస్తున్నాడు? అని అనుకున్నారు కానీ..ఇప్పుడందరూ ఆయనకు సహకరిస్తున్నారు. దానివల్ల అవి ఎన్నోరెట్లు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు చాలా పిచ్చుకలు మా ఇంటిచుట్టూ తిరగడం చూస్తే ఆనందంగా ఉంది."

-త్రినాథ్, స్థానికుడు

మారుతున్న వాతావరణ పరిస్థితులు, మానవ చర్యలు పిచ్చుకల జీవనానికి ప్రమాదకరంగా మారాయి. తమ ఇళ్ల వద్ద పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పిస్తే వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవచ్చని మహేష్ సూచిస్తున్నాడు.

ఇదీ చూడండి: పదేళ్లుగా 'కరోనా'తో ఆనందాల కాపురం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.