Ancient Silver Coins In India: హరియాణా పానీపత్ జిల్లాలో 187 అతిపురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. జిల్లాలోని పట్టికాల్యాణ గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం భూమిని తవ్విన క్రమంలో అవి కనిపించాయని స్థానికులు తెలిపారు.
దేవాలయ నిర్మాణం జరుగుతున్న భూమి త్రిలోక్ చంద్ర అగర్వాల్ అనే వ్యక్తికి చెందిన పూర్వికులదిగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ముంబయిలో ఉంటున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నాణేలను పానీపత్ మ్యూజియం ఇంఛార్జీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. పురావస్తు శాస్త్ర శాఖకు సమాచారం అందించామని చెప్పారు. త్వరలో ఈ భూభాగంలో తవ్వకాలు జరుపుతారని అన్నారు.
10 రోజుల క్రితమే..
ఇదే దేవాలయ నిర్మాణంలో జనవరి 16నే 45 విలువైన పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిని పానీపత్ మ్యూజియం ఇంఛార్జీకి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పంచకుల స్టేట్ మ్యూజియంలో సందర్శనకు ఉంచినట్లు చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: పట్టులా మెరిసే వీరి స్నేహం.. మతసామరస్యానికి చిహ్నం!