ETV Bharat / bharat

కూలిన​ మిగ్​-21 యుద్ధ విమానం- పైలట్​ మృతి - పైలట్​ మృతి

పంజాబ్‌లో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. మంటలు చెలరేగటం వల్ల విమానం కాలిబూడిదైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పైలట్​ ప్రాణాలు కోల్పోయారు.

MiG-21 fighter aircraft
కూలిన ఐఏఎఫ్​ మిగ్​-21 యుద్ధ విమానం
author img

By

Published : May 21, 2021, 8:42 AM IST

Updated : May 21, 2021, 9:25 AM IST

భారత వాయుసేనకు చెందిన మిగ్​-21 యుద్ధ విమానం.. పంజాబ్​లో కుప్పకూలింది. మంటలు చెలరేగి.. విమానం కాలిబూడిదైంది. పంజాబ్‌లోని మోగా సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పైలట్​ స్క్వాడ్రన్​ లీడర్‌ అభినవ్‌ చౌదరి మృతి చెందారు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు వాయుసేన వర్గాలు తెలిపాయి.

మంటల్లో కాలుతున్న మిగ్​-21 యుద్ధ విమానం
MiG-21 fighter aircraft crashed
మంటల్లో కాలిబూడిదైన మిగ్​-21 యుద్ధ విమానం

ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మిగ్‌ యుద్ధవిమానం కూలిపోవటానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని తేల్చనున్నారు.

ఇదీ చూడండి: జమ్ములో ఉగ్రవాది అరెస్ట్-3 గ్రెనేడ్లు స్వాధీనం

ఇదీ చూడండి: 'లెక్కలు' తప్పడం వల్లే ఆ నౌకకు ప్రమాదం

Last Updated : May 21, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.