ETV Bharat / bharat

'బడ్జెట్ సమావేశాల్లో పెగసస్​పై ప్రత్యేక చర్చ అవసరం లేదు' - ఓం బిర్లా

All party meeting: పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. పెగసస్​ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రత్యేకంగా చర్చ అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం. 25 పార్టీలతో వర్చువల్​గా అఖిలపక్ష భేటీ నిర్వహించింది.

An all-party meeting
అఖిలపక్ష భేటీ
author img

By

Published : Jan 31, 2022, 10:19 PM IST

All party meeting: పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్షాలతో సమావేశమయ్యారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్​పై సమగ్ర చర్చకు సహకరించాలని కోరారు. పార్లమెంట్​ సజావుగా సాగేందుకు సహకరిస్తామని పార్టీల నేతలు హామీ ఇచ్చినట్లు చెప్పారు.

An all-party meeting
అఖిలపక్ష భేటీకి హాజరైన నేతలు

" ఈ కీలకమైన బడ్జెట్​ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని నేతలు భరోసా ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం, వార్షిక బడ్జెట్​పై విస్తృత చర్చ జరగాలని కూడా వారిని నేను కోరాను. యావత్​ దేశానికి సంబంధించిన అంశాలను లేవనెత్తి, చర్చ చేపట్టాలి. "

- ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​.

రాజ్యసభ ఎంపీలతో వెంకయ్య భేటీ

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 పార్టీలు సభ్యులతో వర్చువల్​గా సమావేశమయ్యారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. తొలిదశ బడ్జెట్​ సెషన్​లో ఫిబ్రవరి 11 వరకు శూన్య గంట, ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేటు సభ్యుల సమయం మినహా.. కేవలం 23 గంటల సమయం మాత్రమే ఉందని సూచించారు.

ఈ క్రమంలో సమయాభావం కారణంగా ఈ సెషన్​లో శాసన వ్యవహారాలు ఉండవని రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్​ గోయల్​ తెలియజేశారు. పలువురు నేతలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సభ కొనసాగేలా చూడాలని కోరారు.

పెగసస్​పై ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు..

పెగసస్ అంశం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది కేంద్రం. పార్లమెంట్​ సజావుగా సాగేందుకు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలని కోరింది. అయితే, ఏదైనా అంశాన్ని లేవనెత్తాలని విపక్షాలు కోరుకుంటే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో చేయొచ్చని స్పష్టం చేశారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల వేళ 25 పార్టీల నేతలతో వర్చువల్​గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ హాజరయ్యారు. బడ్జెట్​ సెషన్స్​ సజావుగా సాగేందుకు కృషి చేయాలని నేతలను కోరారు ఇరువురు నేతలు.

పెగసస్​, ఎంఎస్​పీ గ్యారంటీ చట్టానికి ఆప్​ డిమాండ్​..

అఖిలపక్ష పార్టీల సమావేశంలో పెగసస్ స్పైవేర్​ అంశాన్ని లేవనెత్తారు ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్​ సింగ్​. బడ్జెట్​ సెషన్స్​లో పెగసస్​ స్పైవేర్​ అంశంపై చర్చించాలని డిమాండ్​ చేశారు. మహాత్మాగాంధీని అవమానించే వారిని నిలువరించాలన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'కేంద్రం నిరంతర ప్రయత్నాల వల్లే అభివృద్ధి పథంలో భారత్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.