ETV Bharat / bharat

బంగాల్​​: ఒకే ప్రాంతంలో దీదీ, షా ర్యాలీలు

బంగాల్​ రాజకీయంలో గురువారం కీలకమైన రోజుగా నిలవనుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గురువారం దక్షిణ 24 పరగణాల జిల్లాలో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. మరోవైపు.. అదే జిల్లాలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులు వేడెక్కాయి.

Amit Shah on two-day tour of poll-bound Bengal
నేడు ఒకే జిల్లాలో దీదీ, షా ర్యాలీలు
author img

By

Published : Feb 18, 2021, 5:20 AM IST

Updated : Feb 18, 2021, 5:55 AM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడేక్కుతున్నాయి. కోల్​కతాకు పొరుగున ఉన్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు గురువారం ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కొద్ది దూరంలోనే ఇద్దరు ముఖ్యనేతల కార్యక్రమాలతో జిల్లాలో పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. గురువారం ఘర్షణల వంటివి తలెత్తే పరిస్థితులు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మమతా బెనర్జీ, అమిత్​ షాలు ఒకే జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం ఇదే తొలిసారి.

గురువారం నుంచి రెండు రోజుల పాటు బంగాల్​లో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి షా.. బుధవారం రాత్రి కోల్​కతాకు చేరుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్​ ద్వీపాల సమీపంలోని కాక్​ద్వీప్​ను సందర్శించనున్నారు షా. భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ఐదు దశల పరివర్తన్​ యాత్రలో చివరి దశను ప్రారంభించనున్నారు. కపిల్​ ముని ఆశ్రమాన్ని సందర్శించి.. అక్కడి నుంచి పరివర్తన్​ యాత్ర చేపట్టే నంఖానాకు చేరుకుంటారని రాష్ట్ర భాజపా సీనియర్​ నేత ఒకరు తెలిపారు. ఇందులో భాగంగానే ఓ వలస కార్మికుడి ఇంట్లో భోజనం చేసి.. రోడ్​ షోలో పాల్గొంటారని వెల్లడించారు.

మరోవైపు.. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిశేక్​ బెనర్జీలు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పైలాన్​లో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.

"రేపు రాజకీయంగా చాలా కీలకమైన రోజు. ఒకే జిల్లాలో అమిత్​ షా, దీదీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. "

- టీఎంసీ సీనియర్​ నేత, 24 పరగణాల జిల్లా

2019 సాధారణ ఎన్నికల్లో బంగాల్​లోని 42 లోక్​సభ స్థానాలకు 18 స్థానాలను కైవసం చేసుకుని అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు ప్రధాన ప్రతిపక్షంగా మారింది భాజపా. ఈ ఎన్నికల్లో టీఎంసీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రంలో భాజపా బలం పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మమత పాలనకు శుభం కార్డు పడుతుందని భావిస్తున్నారు నేతలు.

ఇదీ చూడండి: బంగాల్​ మంత్రిపై బాంబు దాడి

Last Updated : Feb 18, 2021, 5:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.