Amit Shah Meeting: దేశ భద్రత, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అధికారులతో చర్చించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఉగ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా ఉండే తీవ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపులు, ఉగ్రసంస్థల ఆర్థిక మూలాలు, నార్కో టెర్రరిజం, సైబర్‌స్పేస్‌ను అక్రమంగా ఉపయోగించడం, విదేశీ ఉగ్రవాద కదలికలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపింది.

మారుతున్న ఉగ్రవాదాన్ని, భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం అవసరం అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ భేటీలో కేంద్ర భద్రతా సంస్థలైన కేంద్ర సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ విభాగం, భద్రతా దళాలు, రెవెన్యూ, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు పాల్గొన్నాయి.

కొత్త ఏడాదిలో.. అమిత్ షా ఉన్నతాధికారులతో సమావేశం కావడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి : మాజీ ఎమ్మెల్యే బంధువు అరెస్ట్- ఐసిస్‌తో లింకులే కారణం!