ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజాపుర్ ఎన్కౌంటర్లో 23 మంది జనవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర నిఘా సంస్థ డైరెక్టర్ అరవింద్ కుమార్, హోం మంత్రిత్వ శాఖ, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్కౌంటర్ ఘటనతో అసోంలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని దిల్లీ చేరుకున్నారు షా. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌తో మాట్లాడిన షా.. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
మావోయిస్టులు రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. అమరులైన జవాన్ల త్యాగాలు ఎన్నటికీ వృథా పోవని స్పష్టం చేశారు.
12మంది నక్సల్స్ మృతి
శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సల్స్ మృతిచెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మరో 16 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. ఓ మహిళా నక్సలైట్‌ను పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: బీజాపుర్ ఎన్కౌంటర్లో 23 మంది జవాన్లు మృతి