తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 6న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం ఇక్కడ పర్యటించారు. ఆ స్థానానికి భాజపా తరఫున కేంద్ర మాజీ మంత్రి రాధాకృష్ణన్‌ను పార్టీ ఖరారు చేసింది.
'అసెంబ్లీలోనూ భాజపాదే జయభేరి!'
ఈ సందర్భంగా సుచీంద్రంలో 'వెట్రివేల్ అయేంది సెల్వమ్' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన షా.. రాధాకృష్ణన్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఫలితం కచ్చితంగా అర్థమవుతోందని హర్షం వ్యక్తం చేశారాయన. ఈ ఉత్సాహంతో కన్యాకుమారి లోక్‌సభ స్థానంలోనే కాదు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా సత్తా చాటుతుందని అమిత్ షా అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు భాజపా, అన్నాడీఎంకే మధ్య పొత్తులో భాగంగా సీట్ల పంపిణీ విషయంలో ఒప్పందం కొలిక్కి వచ్చింది. భాజపాకు 20 అసెంబ్లీతో పాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానాన్ని కేటాయిస్తూ అన్నాడీఎంకే నిర్ణయించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఓకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: తమిళనాట 25 చోట్ల బరిలో కాంగ్రెస్