ETV Bharat / bharat

దిల్లీకి ఛత్తీస్​గఢ్​ ఎమ్మెల్యేల క్యూ.. సీఎం ఏమన్నారంటే?

ఛత్తీస్​గఢ్​లో నాయకత్వ మార్పు జరగనుందని(chhattisgarh cm change news ) కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​(chhattisgarh cm bhupesh baghel) వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు దిల్లీ వెళ్లగా. వాటికి బలం చేకూరినట్లయింది. శుక్రవారం మరో కొంతమంది హస్తినకు వెళ్లినట్లు సమాచారం. అయితే.. ఎమ్మెల్యేల దిల్లీ పర్యటనపై వస్తున్న వార్తలను ఖండించారు సీఎం.

Chhattisgarh
ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్
author img

By

Published : Oct 2, 2021, 3:57 PM IST

పంజాబ్​ తరహాలో ఛత్తీస్​గఢ్​లోనూ ముఖ్యమంత్రి మార్పునకు(chhattisgarh cm change news ) కాంగ్రెస్​ అధిష్ఠానం మొగ్గు చూపనుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవలే.. ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​(chhattisgarh cm bhupesh baghel)​ సన్నిహిత వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు దిల్లీకి మకాం మార్చటం వాటికి బలం చేకూర్చింది. తాజాగా మరింత మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకున్నారు. బఘేల్​ వర్గం ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లటం.. ఆయనకు ఉన్న బలాన్ని నిరూపించుకునేందుకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యేలు(chhattisgarh congress news) తమ సొంత నిర్ణయంతో దిల్లీకి వెళ్లారని, ఇది బల ప్రదర్శన కానేకాదని బఘేల్​ వర్గంలోని పలువురు స్పష్టం చేశారు.

ఇప్పటికే దిల్లీకి 20 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు చేరుకోగా.. శుక్రవారం రాత్రికి మరో 10 మంది వెళ్లినట్లు సమాచారం.

2021, జూన్​లో ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు భూపేశ్​ బఘేల్​. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పు జరగాలని డిమాండ్​లు(chhattisgarh congress crisis) వచ్చాయి. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగిస్తామని కాంగ్రెస్​ అధిష్ఠానం 2018లో హామీ ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి టీఎస్​ సింగ్​ దేవ్​ పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనేది ఉండబోదని స్పష్టం చేశారు బఘేల్​ మద్దతుదారు, దిల్లీ చేరుకున్న ఎమ్మెల్యే బ్రిహస్పత్​ సింగ్​. బఘేల్​ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందన్నారు. 'ఇక్కడకు ఏఐసీసీ ఛత్తీస్​గఢ్​ ఇంఛార్జి పీఎల్​ పూనియాని కలిసేందుకు వచ్చాం. రాష్ట్రంలో రాహుల్​ గాంధీ పర్యటనను పొడిగించాలని కోరాలనుకుంటున్నాం. దాని ద్వారా ఎమ్మెల్యేలందరికీ లబ్ధి చేకూరుతుంది.' అని పేర్కొన్నారు సింగ్​.

అలా జరగదు..

ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లటంపై స్పందించారు ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​. ఛత్తీస్​గఢ్​.. పంజాబ్​లా మారబోతుందని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఛత్తీస్​గఢ్​ ఎప్పటికీ పంజాబ్​లా కాబోదని స్పష్టం చేశారు.

" తమ సొంత నిర్ణయంతోనే ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లారు, వారు స్వతంత్రులు. అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఛత్తీస్​గఢ్​ ఎప్పటికీ పంజాబ్​లో మారదు."

- భూపేశ్​ బఘేల్​, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి.

ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లటం వెనక నాయకత్వ మార్పు ఉందన్న ఊహాగానాలను గత గురువారమే తిప్పికొట్టారు సీఎం. ' ఒకటి చెప్పండి.. ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లకూడదా? ప్రతి ఒక్క పనిని రాజకీయంగా చూడకూడదు. ఎవరైనా.. ఎక్కడికైనా వెళ్లొచ్చు. మీరు(మీడియా వారు) మీ స్నేహితులతో టూర్​కు వెళ్తారు. దానర్థం న్యూస్​ కోసమే వెళ్లినట్లు కాదు కదా? అలాగే.. ఎవరైనా దిల్లీ వెళితే.. దానిని రాజకీయ కోణంలో చూడొద్దు.' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దిల్లీకి 15 మంది ఛత్తీస్​గఢ్​ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

రాహుల్​తో భూపేశ్ భేటీ.. సీఎం మార్పు అనివార్యమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.