ETV Bharat / bharat

కొవిడ్ ఆంక్షల అమలుపై షాకింగ్ సర్వే- థర్డ్ వేవ్ తప్పదా?

పండగ సీజన్​ దృష్ట్యా.. దేశంలోని చాలా ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు(Covid-19 Norms) అమల్లో లేవని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. రెండు శాతం మంది భారతీయులు మాత్రమే.. తమ ప్రాంతాల్లో మాస్కు ధారణ(Corona Guidelines) పాటిస్తున్నారని అనుకుంటున్నట్లు వెల్లడైంది.

Covid protocol
కొవిడ్ ఆంక్షలు
author img

By

Published : Oct 31, 2021, 7:48 PM IST

కొవిడ్​ ఆంక్షలు(Covid-19 Norms), భౌతికదూరం, మాస్కుధారణ(Corona Guidelines).. తదితర అంశాలపై నిర్వహించిన సర్వేలో విస్తురపోయే విషయాలు బయటకొచ్చాయి. లోకల్ సర్కిల్స్ అనే డిజిటల్​ సంస్థ.. దేశవ్యాప్తంగా 366 జిల్లాల్లో 20వేల మందిపై సర్వే నిర్వహించింది.

సర్వేలో వెల్లడైన విషయాలు..

  • మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కచ్చితంగా పాటిస్తున్నారని 2శాతం మంది భారతీయులు మాత్రమే భావిస్తున్నారు.
  • తమ జిల్లాల్లోని ప్రజలు.. భౌతిక దూరం(Corona Guidelines) నియమాలను పాటిస్తున్నట్లు 3శాతం మంది ప్రజలు మాత్రమే అనుకుంటున్నారు.
  • తమ ప్రాంతంలో 90శాతం మందికిపైగా ప్రజలు మాస్కు ధరించటం, భౌతికదూరం పాటిస్తున్నట్లు 2 శాతం మంది మాత్రమే తెలిపారు.
Covid protocol
పండగ షాపింగ్​లో నిమగ్నమైన ప్రజలు
Covid protocol
దిల్లీలోని లజ్​పత్ నగర్​లో గుమికూడిన ప్రజలు
Covid protocol
కొవిడ్ ఆంక్షలు బేఖాతరు
Covid protocol
దిల్లీలోని సదర్ బజార్​లో అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు
  • ప్రయాణాల్లో భౌతిక దూరం పాటించటం లేదని మరో 9శాతం మంది తెలిపారు.
  • పండగ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్​లో కొవిడ్ ఆంక్షలను(Covid-19 Norms) కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోందని సర్వే తెలిపింది.
  • గ్రామీణ జిల్లాలు, టైర్​ 3, 4 ప్రాంతాల్లో మాస్కు ధారణ, సామాజిక దూరం విధిగా పాటించాలని అర్థమవుతోందని పేర్కొంది.
  • ప్రజలు కొవిడ్ ఆంక్షలను గాలికొదిలేస్తే.. దేశవ్యాప్తంగా కొవిడ్​ థర్డ్​ వేవ్ వ్యాప్తి అవకాశముందని అభిప్రాయపడింది.
    Covid protocol
    భౌతికదూరం పాటించకుండా గుమికూడిన ప్రజలు
    Covid protocol
    దిల్లీలోని సదర్ బజార్​లో కొవిడ్ ఆంక్షలను పట్టించుకోని ప్రజలు
    Covid protocol
    దీపావళి షాపింగ్ చేస్తున్న ప్రజలు
    Covid protocol
    దిల్లీలోని ఓ దుకాణంలో ఇలా..

ఈ సర్వేలో సమాధానం ఇచ్చిన వారిలో 42శాతం మంది టైర్1 జిల్లాలు, 30శాతం టైర్​2, 23శాతం టైర్​3, టైర్4 జిల్లాల నుంచి ఉన్నారు. ఈ సర్వేలో 65 శాతం మంది పురుషులు, 35శాతం మంది మహిళలు పాల్గొన్నారు.

" మాస్కు ధరించటంపై రేటింగ్స్​ 29శాతం నుంచి 2శాతానికి తగ్గాయి. భౌతికదూరం పాటించటంపై రేటింగ్స్ 11నుంచి 3శాతానికి పడిపోయాయి. దీన్నిబట్టి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమల్లో లేవని మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు."

-- సచిన్ తపారియా, లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు

దేశంలోని రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలను(Covid-19 Norms) కట్టుదిట్టంగా అమలు చేయటం లేదని సర్వేలో భాగంగా.. పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తపారియా అన్నారు.

ఇదీ చూడండి: విదేశాల​ నుంచి రాగానే వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.