రెండోదశ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.
![Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_delhi1.jpg)
![Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_delhi2.jpg)
కేరళలో ఈ నెల 16 వరకు లాక్డౌన్ అమల్లో ఉండగా.. అక్కడ వాహనాల తనిఖీ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. నిత్యం రద్దీగా ఉండే తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి.
![Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_kerala2.jpg)
![Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_kerala1.jpg)
![Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_kerala3.jpg)
గోవాలో ఆదివారం నుంచి ఈ నెల 24 వరకు లాక్డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. నిత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది. కిరాణా దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే అందుబాటులో ఉండనున్నాయి.
![Goa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_goa1.jpg)
![Goa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_goa2.jpg)
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. మొరాదాబాద్‌లో కర్ఫ్యూ విధించారు అధికారులు. దీంతో అక్కడి రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.
![UP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_up2.jpg)
![UP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_up1.jpg)
కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఈ నెల 10 నుంచి 24వరకు(రెండు వారాల పాటు) లాక్డౌన్ విధించనున్నట్టు యడియూరప్ప సర్కార్ తెలిపింది. ఈ నేపథ్యంలో.. హుబ్బళి, శివమొగ్గ ప్రాంతాల వారు ఒక్కసారిగా మార్కెట్ల వద్ద గుమిగూడారు. కొవిడ్ మార్గదర్శకాలేవీ పాటించకుండా రోడ్లపై తిరిగారు. వారాంతపు జనతా కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు లెక్కచేయకపోవడం ఆందోళనకర విషయం.
![Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_ka3.jpg)
![Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_ka2.jpg)
![Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_ka1.jpg)
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఈ నెల 15వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నా.. దాన్ని విస్మరించారు అక్కడి ప్రజలు. మాస్క్‌లు, భౌతికదూరం నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. మార్కెట్లు కిటకిటలాడాయి.
![Maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_mh1.jpg)
![Maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694632_mh2.jpg)
ఇదీ చూడండి: కొవిడ్ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్