ETV Bharat / bharat

రూ. 80వేలు ఇచ్చాకే కొవిడ్ రోగి మృతదేహం తరలింపు! - హరిద్వార్ న్యూస్

కొవిడ్​ రోగి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు రూ. 80 వేలు డిమాండ్​ చేశాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. ఈ బాధాకరమైన ఘటన ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జరిగింది.

ambulance seized
అంబులెన్స్ సీజ్, బెల్ ఉద్యోగి మృతి
author img

By

Published : May 2, 2021, 10:11 AM IST

భారీ మొత్తంలో డబ్బులిస్తేనే కొవిడ్​ రోగి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తానని క్రూరంగా ప్రవర్తించాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. ఈ బాధాకరమైన ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్​లో జరిగింది.

రూ. 80 వేలు అశించి..

భారత్​ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) సంస్థలో ఏజీఎంగా పనిచేస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం కొవిడ్​తో హర్ మిలాప్ మిషన్ రాజ్​కియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే.. మృతుడి తనయుడు అమెరికాలో నివాసం ఉంటున్నాడని, తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తనకు ఆలస్యమవుతుందని.. ఆ మృతదేహాన్ని అంబులెన్స్​లో ఉంచాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆలోచించారు.

ambulance seized
అధికారులు సీజ్ చేసిన అంబులెన్స్

ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబసభ్యుల నుంచి రూ. 80 వేలు డిమాండ్ చేశాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. తాను డిమాండ్ చేసిన డబ్బు ఇస్తేనే మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తానని అన్నాడు. చేసేదేమీలేక డ్రైవర్​ అడిగన మొత్తాన్ని చెల్లించారు మృతుడి కుటుంబీకులు.

చివరకు అధికారులకు చిక్కి..

ఈ క్రమంలోనే డబ్బులు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు ఆ అంబులెన్స్ డ్రైవర్. వెంటనే అంబులెన్స్​ను సీజ్​ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్ టెస్టుకు వెళ్లి.. విగతజీవిగా మారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.