రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ రియాజ్ కాజీకి ఈ నెల 23 వరకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు కస్టడీ విధించింది.
ఈ కేసులో సస్పెండైన సచిన్ వాజేకు రియాజ్ కాజీ సహకారం అందించినట్లుగా భావిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. కాజీని ఏప్రిల్ 11న ఎన్ఐఏ అరెస్టు చేయగా. . శుక్రవారంతో రిమాండ్ ముగిసింది. తదుపరి రిమాండ్ కోరకపోవడం వల్ల కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఇదీ చదవండి: సచిన్ వాజేకు ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు