Indian Army Bridge: ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్.. అద్భుతం చేసింది. అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఈ ఆర్మీ విభాగం.. గంటల వ్యవధిలోనే ధ్వంసమైన వంతెనను పునర్నిర్మించింది.
వివరాల్లోకి వెళితే...
మంచు శివలింగాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఆర్మీ. అయితే ఇటీవలే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య రాత్రి కొండచరియలు విరిగిపడి యాత్రా మార్గంలో బల్తాల్ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీమాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది.
![ARMY BRIDGE BUILDING](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15722883_moeoe.jpg)
![ARMY BRIDGE BUILDING](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15722883_meiie.jpg)
బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అమర్‌నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా చేశారు.
![ARMY BRIDGE BUILDING](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15722883_ekee.jpg)
సరిహద్దులో పహారా కాయడమే కాదు, ఆపద సమయాల్లో సాహసోపేతమైన చర్యలతో ఇండియన్ ఆర్మీ.. అందరి మనసులను గెలుచుకుంటుంది. అమర్‌నాథ్ యాత్ర కొనసాగే మార్గంలో సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. 200 హైపవర్డ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. జవాన్లతో పాటు 130 స్నిఫర్ డాగ్స్ ఇక్కడ విలువైన సేవలు అందిస్తున్నాయి.
ఇవీ చదవండి: రాష్ట్రపతి రబ్బర్ స్టాంపేనా?.. అసలీ పేరెలా వచ్చింది?