ETV Bharat / bharat

మద్యం, రింగ్‌రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్​పై విచారణ వాయిదా

HC_on_Chandrababu_Amaravati_Ring_Road_Case

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 12:10 PM IST

Updated : Nov 21, 2023, 5:06 PM IST

12:07 November 21

సీఐడీ సమయం కోరడంతో ఈనెల 23కు వాయిదా వేసిన హైకోర్టు

HC on Chandrababu Amaravati Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్​రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్​పై విచారణను హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్​పై ఈరోజు విచారణ జరిపిన ధర్మాసనం.. సీఐడీ సమయం కోరడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అందిన ఫిర్యాదుతో సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

CBN Anticipatory Bail Petition: ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈనెల 7వ తేదీన న్యాయస్థానం విచారించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున ఆ గడువు వరకు ఆయన్ను అరెస్ట్‌ చేయబోమని అడ్వకేట్‌ జనరల్‌ ఏజీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. తొందరపాటు చర్యలేమీ తీసుకునే ఉద్దేశం లేదన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

మద్యం కేసు విచారణ రేపటికి వాయిదా: మద్యం కంపెనీలకు అనుమతుల కేసులో... ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తరఫున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అనుమతుల సమయంలో... గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పలేదనే విషయాన్ని నాగముత్తు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు కూడా నిబంధనల మేరకే తీసుకున్నారన్న కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సీఐడీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు.

Last Updated : Nov 21, 2023, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.