దేశంలో ఈ ఏడాది మే 7న నమోదైన గరిష్ఠ కేసులతో పోలిస్తే ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల్లో దాదాపు 85 శాతం క్షీణత కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు 5 వేల కన్నా తక్కువ ఉన్నట్లు తెలిపింది.
డెల్టా ప్లస్ ప్రమాదకరం కాదు..
"కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరం కాదు. ఈ వేరియంట్ మార్చి నుంచి ఉంది. ఇది ప్రమాదకర వేరియంట్ కాదు. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మరింత తెలుసుకుని.. దాని పురోగతిని ట్రాక్ చేస్తున్నాం."
-- కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ
రెండో దశలో 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు 11.62 శాతం కొవిడ్ బారినపడ్డారని .. మొదటి దశలో ఇది 11.31 శాతంగా ఉందని వివరించింది ఆరోగ్య శాఖ.
వారంలో నమోదైన కరోనా పాజిటివిటీ రేటు 78 శాతం నుంచి 21.4 శాతానికి తగ్గిందని వెల్లడించింది.
ఇదీ చదవండి : డేల్టా వేరియంట్‌పైనా ఈ టీకా పనితీరు భేష్!