కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు.. 4 వారాల తర్వాత ఎప్పుడైనా వేసుకునే సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని.. కేరళ హైకోర్టు (kerala high court covishield) ఆదేశించింది. ఇప్పుడున్న 84 రోజుల గడువు కాకుండా.. ఎవరైతే టీకా తీసుకోవడానికి ముందుకు వస్తారో వారికి, వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఆ మేరకు కొవిన్ పోర్టల్‌లో మార్పులు చేయాలని.. కేరళ హైకోర్టు కేంద్రానికి సూచించింది.
విదేశాలకు వెళుతున్న వారికి ముందుగానే వ్యాక్సిన్ వేసుకునే సదుపాయం కల్పించినప్పుడు..ఇక్కడే ఉన్న వారికి ఎందుకు ఇవ్వకూడదని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సిన్ గడువు నిబంధనను సడలించి, కరోనా నుంచి రక్షణ పొందాలనుకునే వారికి వీలుగా.. కొవిన్ పోర్టల్‌లో మార్పులు చేయాలంటూ కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు.. ఈ మేరకు కేంద్రానికి సూచనలు చేసింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 3న కేంద్రానికి ఆదేశాలు ఇవ్వగా.. సోమవారం ఆ ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ చూడండి : ఒకే వ్యక్తికి నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు