ETV Bharat / bharat

కేరళ సమరం- కౌంటింగ్​కు సర్వం సిద్ధం - కేరళ ఎన్నికల ఫలితాలు

2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నిబంధనల మధ్య కౌంటింగ్​ నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టింది. మొత్తం 957మంది ఎన్నికల్లో పోటీపడగా.. ఎల్​డీఎఫ్​నే విజయం వరిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి.

All set for counting of votes, parties in Kerala await outcome anxiously
కేరళ సమరం: కౌంటింగ్​కు సర్వం సిద్ధం
author img

By

Published : May 1, 2021, 5:36 PM IST

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుండగా.. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 140 అసెంబ్లీ ఎన్నికలకు ఒక విడతలో పోలింగ్​ జరగ్గా.. 957మంది ఎన్నికల బరిలో నిలిచారు. గెలుపుపై ప్రధాన కూటములు ఎల్​డీఎఫ్​- యూడీఎఫ్​ ధీమాగా ఉన్నాయి.

కేరళ సమరం

  • మొత్తం సీట్లు: 140
  • మ్యాజిక్​ ఫిగర్​:
  • పోలింగ్​: ఏప్రిల్​ 6
  • ప్రధాన పోటీ: ఎల్​డీఎఫ్​ X యూడీఎఫ్​

కరోనా వేళ...

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. కౌంటింగ్​ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈసీ. ఇందుకోసం కేరళవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫేస్​ షీల్డ్స్​, మాస్కుల పంపిణీ, శానిటైజేషన్​ ప్రక్రియను ముమ్మరం చేసింది.

మొత్తం మీద 114 కేంద్రాల్లో.. 24వేల మంది పోలింగ్​ సిబ్బంది, 30,281మంది పోలీసు సిబ్బంది, 3,332మంది కేంద్ర బలగాల సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది ఈసీ.

ఇదీ చూడండి:- విజయన్‌ చరిత్ర సృష్టిస్తారా?

కౌంటింగ్​ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ఏజెంట్లు.. కచ్చితంగా కరోనా నెగిటివ్​ రిపోర్టును చూపించాలి. లేదా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రాలను సమర్పించాలి.

అదే సమయంలో.. కౌంటింగ్​ కేంద్రాల బయట ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టింది ఈసీ. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పని స్పష్టం చేసింది.

ఎల్​డీఎఫ్​ రిపీట్​?

ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం కేరళలో ఓ కల. కానీ ఈసారి.. పినరయి విజయన్​ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ తిరిగి అధికారాన్ని సాధిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. దీనిపై పినరయి వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఎగ్జిట్​ పోల్స్​ను తాము నమ్మడం లేదని.. ప్రజలు తమవైపే ఉన్నారని యూడీఎఫ్​ తేల్చిచెబుతోంది. ఈ దఫా ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుందని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టంగడతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఇదీ చూడండి:- ఎన్నికల్లో.. కమల బలమా? విపక్ష గళమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.