ETV Bharat / bharat

'ఆ ప్రయాణికులకు హోం క్వారంటైన్​ తప్పనిసరి'

Home Quarantine: భారత్​కు వచ్చిన ప్రయాణికులకు 7 రోజుల పాటు హోం క్వారంటైన్​ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

home quaratine
'ఆ ప్రయాణికులకు హోం క్వారంటైన్​ తప్పనిసరి'
author img

By

Published : Jan 7, 2022, 4:17 PM IST

Updated : Jan 7, 2022, 5:29 PM IST

Home Quarantine: దేశంలో కరోనా కేసులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను కట్టుదిట్టం చేస్తోంది. విదేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులు అందరికీ 7 రోజుల పాటు హోం క్వారంటైన్​ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 11న ఈ ఆదేశాలు అమలోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఆ దేశాల నుంచి వస్తే..

ఆందోళనకర స్థాయిలో కరోనా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం దృష్టి సారించింది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిడ్​ టెస్టులు తప్పనిసరి చేసింది. ఫలితాల్లో నెగటివ్​ వస్తే వారు ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్​లో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజు మరోసారి టెస్ట్​ చేయించుకోవాలి. ఆ ఫలితాలను ప్రయాణికులు ఎయిర్​ సువిధా పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలి. టెస్ట్​లో నెగటివ్​ వస్తే 7 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి. ఒకవేళ పాజిటివ్​ వస్తే అధికారులు వారిని ఐసోలేషన్​కు తరలించి చికిత్స అందిస్తారు.

Home Quarantine
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం మార్గదర్శకాలు

రిస్క్​ దేశాల జాబితాను కూడా కేంద్రం విడుదల చేసింది. వీటిలో ఐరోపా దేశాలు సహా దక్షిణాఫ్రికా, బ్రెజిల్​, చైనా వంటి దేశాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికులు కూడా ఈ నిబంధనలను అనుసరించాలని తెలిపింది.

ఇదీ చూడండి : 'పంజాబ్ ఇష్యూ'పై భాజపా నయా గేమ్​ప్లాన్​.. టార్గెట్ కాంగ్రెస్!

Last Updated : Jan 7, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.