ETV Bharat / bharat

చైనా ఎత్తులు మా దగ్గర పనికిరావు: ఐటీబీపీ

చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ వెంబడి నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలిపింది అరుణాచల్​ ప్రదేశ్​ తవాంగ్​ సెక్టార్​లోని ఐటీబీపీ. తమ ప్రాంతంలో చైనా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడే వీలులేదని వెల్లడించింది. సైనిక సన్నాహాల్లో తాము ఉన్నత స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

ITBP
ఇండోటిబెటన్​ సరిహద్దు దళం
author img

By

Published : Dec 26, 2020, 1:02 PM IST

తూర్పు లద్దాఖ్​లో జరిగిన ఘర్షణలో చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీకి దీటైన సమాధానమిచ్చాయి భారత బలగాలు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో వాస్తవాధీన రేఖ( ఎల్​ఏసీ) వెంబడి అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది అరుణాచల్​ ప్రదేశ్​లోని సున్నిత ప్రాంతం తవాంగ్​ సెక్టార్​కు చెందిన ఇండో-టిబెటన్​ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ). ఈ ప్రాంతంలో చైనా ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడలేదని వెల్లడించింది.

ITBP
ఎల్​ఏసీ వెంబడి ఐటీబీపీ సైనికులు

" తూర్పు లద్దాఖ్​లో చైనా సైన్యం చొరబాట్లకు పాల్పడిన ఘటన నుంచి నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ, ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకునే వీలు లేదు. ప్రస్తుతం అత్యంత శీతల వాతావరణంలోనూ మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దులపై అనునిత్యం నిఘా ఉంచుతున్నారు. ఇక్కడ మమ్మల్ని ఎవరూ ఆశ్చర్యానికి గురిచేయలేరు. దేశాన్ని రక్షించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. మా విధులు నిర్వర్తిస్తూ సన్నాహాల్లో ఉన్నత స్థానంలో ఉన్నాం. "

- ఐబీ ఝా, ఐటీబీపీ 55 బెటాలియన్​ కమాండర్​

ఏప్రిల్​-మే సమయంలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో ఐటీబీపీ సైనికులు ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించారని, అది తవాంగ్​ సెక్టార్​లో మోహరించిన బలగాలకు ప్రేరణగా నిలిచిందన్నారు ఝా. ఈ ప్రాంతంలో అలాంటి సంఘటనలు ఎదురైతే వారి స్ఫూర్తితో అంతకు మించి పోరాడతామని తమ సిబ్బంది పేర్కొంటున్నట్లు చెప్పారు. అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉన్నామన్నారు.

ITBP
జీరో పాయింట్​ వద్ద సరిహద్దులను పరిశీలిస్తోన్న జవాన్​

తవాంగ్​ సెక్టార్​లో ప్రభుత్వం కొద్ది సంవత్సరాలుగా చేపట్టిన మౌలిక సదుపాయాలతో ఎల్​ఏసీ వెంబడి జీరో పాయింట్​ వరకు బలగాలు చేరగలుగుతున్నాయని తెలిపారు ఝా. దాంతో ఏదైన అనుకోని సంఘటన ఎదురైతే సత్వరం స్పందించేందుకు వీలుకలిగిందన్నారు. ​

ITBP
సరిహద్దులో బలగాల పెట్రోలింగ్​

సున్నిత ప్రాంతాల్లో కీలక పాత్ర..

తూర్పు లద్దాఖ్​తో పాటు అరుణాచల్​ ప్రదేశ్​లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలో ఐటీబీపీ కీలక పాత్ర పోషిస్తోంది. పాంగాంగ్ సరస్సు, ఫింగర్​ ఏరియా, పెట్రోలింగ్​ పాయింట్స్​ 14,15,17,17ఏ వంటి ప్రాంతాల్లో చైనా బలగాల చొరబాట్లను దీటుగా ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఎముకలు కొరికే చలిలోనూ సున్నిత ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచుతున్నారు జవాన్లు. ఎల్​ఏసీ వెంబడి పెట్రోలింగ్​ నిర్వహిస్తూ శత్రు దేశం వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు.

ITBP
ఎముకలు కొరికే చలిలోనూ సైనికుల నిఘా

ఇదీ చూడండి: యుద్ధ సన్నద్ధతతో సైన్యం​.. అశాంతి సృష్టిస్తే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.