నెమలి పించాలతో చేసిన వింజామరాలు లేకుండా కేరళలోని ఏ దైవకార్యం జరగదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా త్రిస్సూర్‌లో ఏటా జరిగే పురం ఉత్సవంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతమూర్తుల ఊరేగింపులో ఈ వింజామరలతోనే అయ్యవార్లు సేవ చేస్తుంటారు. వీటిని తయారు చేయడంలో త్రిస్సూర్ ప్రాంతం దేశవ్యాప్తంగా పేరు పొందింది.
'అలవట్టం'ను అందంగా..
నెమలి పించాలతో కూడిన ఈ వింజామరను కేరళలో అలవట్టం అని పిలుస్తారు. ఒక్కో అలవట్టం తయారుచేసేందుకు దాదాపు 2 కిలోల నెమలి ఈకలు అవసరం. ఏటా రాజస్థాన్ నుంచి పెద్దఎత్తున వీటిని కొనుగోలు చేస్తామని కళాకారులు చెబుతున్నారు. సేకరించిన పించాలలో కన్ను భాగం ఉండేలా ఈకలను కత్తిరిస్తారు. అనంతరం వీటికి గుండ్రటి ఆకృతిని తెస్తారు. అలవట్టంపై నగీషీలు దిద్ది అందంగా రూపొందిస్తారు.
పండుగల సమయంలో అలవట్టాలకు విపరీతమైన గిరాకీ ఉంటుందని ఆచార్య మురళీధరన్ చెబుతున్నారు. ఒక జత అలవట్టాలకు రూ.15 వేల వరకు ధర పలుకుతుందని తెలిపారు. తన కుటుంబం గత 50 ఏళ్ల నుంచి వీటిని తయారు చేస్తోందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ