ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్(UP election Akhilesh yadav) సంచలన ప్రకటన చేశారు. 2022లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(UP polls 2022 ) పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ లోక్‌దళ్‌తో (ఆర్‌ఎల్‌డీ) పొత్తు ఖరారైనట్లు తెలిపిన అఖిలేశ్.. సీట్ల పంపకంపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని తెలిపారు.
సమాజ్‌వాదీ తరపున సీఎం అభ్యర్థిగా ఉంటారని అంతా భావిస్తున్న నేపథ్యంలో అఖిలేశ్(Akhilesh Yadav news) అనూహ్య నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి అఖిలేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని భాజపా భారీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే లఖింపుర్ ఖేరీ హింస తర్వాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలతో సందడి చేస్తున్నారు. యూపీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. మహిళలకు 40 శాతం రిజర్వేషన్, ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, బాలికలకు ఈ-స్కూటీలూ వంటి వాగ్దానాలతో దూసుకుపోతున్నారు.
ఇదీ చూడండి: 'గంగమ్మకు భాజపా ద్రోహం చేసింది.. ప్రజలను మోసగించింది'