దేశీయంగా తిరిగే విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఇప్పటివరకు 70శాతంగా తిరుగుతున్న విమానాలను 80శాతంకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది మే నేలలో 30 వేలమంది ప్రయాణికులతో ప్రారంభమైన దేశీయ కార్యకలాపాలు నవంబర్ 30 నాటికి 2.52 లక్షల గరిష్ఠాన్ని తాకినట్లు పేర్కొన్నారు.
గత నెల దేశీయంగా విమానాలు నడిపేందుకు ఆయా సంస్థలకు కేవలం 70 శాతం వరకు మాత్రమే కేంద్రం అనుమతించింది. తాజా నిర్ణయంతో సర్వీసుల సంఖ్య పెరగనుంది. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి దేశీయ సర్వీసులపై ఆంక్షలు విధించింది.