ETV Bharat / bharat

కొచ్చిలో ఫ్లైట్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 45 నిమిషాల వ్యవధిలో!

సాంకేతిత లోపం కారణంగా షార్జా వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా జి9-26 విమానాన్ని కేరళ విమానాశ్రయంలో దింపారు సిబ్బంది. మరోవైపు ఇండిగో విమానం ఇంజిన్​ కుదుపులకు గురవడం వల్ల దిల్లీ నుంచి వడోదరా వెళ్తున్న విమానాన్ని జైపుర్​కు దారి మళ్లించారు.

indigo flight diverted
ఎయిర్‌ అరేబియా విమానం సాంకేతిక లోపం
author img

By

Published : Jul 16, 2022, 9:16 AM IST

షార్జాకు వెళ్లాల్సిన ఎయిర్‌ అరేబియా జి9 - 426 విమానం సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో వెంటనే అప్రమత్తమైన కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు 45 నిమిషాల వ్యవధిలో పరిస్థితులు అన్నింటినీ చక్కదిద్దినట్లు ఎయిర్‌పోర్ట్‌ ఎండీ ఎస్‌.సుహాస్‌ తెలిపారు. ఇక్కడకు రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఎయిర్‌ అరేబియా విమానంలోని 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

విమానం దారి మళ్లింపు: విమానం ఇంజిన్​ కంపించడం వల్ల దిల్లీ నుంచి వడోదరా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్​ను జైపుర్​కు అత్యవసరంగా దారి మళ్లించారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విమానం ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ దారి మళ్లింపు జరిగిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని డీజీసీఏ పేర్కొంది.

ఇవీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటింగ్ ఎలా జరగనుందంటే..

భారీగా హెరాయిన్​ సీజ్​.. సోప్​ బాక్సుల్లో, డీజిల్​ ట్యాంక్​లో.. విలువ రూ.450 కోట్లకుపైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.