ఒరియా నటుడు సవ్యసాచి మిశ్రా సకాలంలో చేసిన సాయం ఐదు ప్రాణాలను కాపాడింది. పేదరికంలో మునిగిపోయిన ఓ మహిళకు కొత్త జీవితం లభించింది. ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఆ మహిళ జన్మనిచ్చింది. మానవతా దృక్ఫథంతో మిశ్రా చేసిన సాయంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
భంజనగర్లోని సారాంకుల్కు చెందిన చాబీ అనే మహిళ గర్భంలో నలుగురు శిశువులు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కూడా చేయించుకునే స్థితిలో లేని మహిళ గురించి తెలుసుకున్న నటుడు మిశ్రా.. గర్భిణీ కోసం ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేశారు. కటక్‌లోని ఎస్సీబీ బోధనాసుపత్రికి ఆమెను తరలించే ఏర్పాట్లు చేశారు.
ఆస్పత్రిలో మహిళకు పరీక్షలు నిర్వహించగా.. సికిల్ సెల్, తీవ్రమైన జాండిస్, అనీమియా వ్యాధులు ఉన్నట్లు తేలింది. దీంతో గైనకాలజీ, హెమటాలజీ, హెపటాలజీ విభాగానికి చెందిన వైద్యులు.. మహిళకు ప్రత్యేక పద్ధతిలో చికిత్స చేశారు. తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడేందుకు వినూత్న పద్ధతిని అనుసరించారు. సర్జరీ కాకుండా.. సాధారణ ప్రసవం జరిగేలా చూశారు.
మహిళకు నలుగురు ఆడపిల్లలు జన్మించగా.. వీరందరి ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు మిశ్రా తెలిపారు. మహిళ సైతం చికిత్సకు స్పందిస్తోందని వివరించారు.
-
ଓଡ଼ିଶାରେ ଘଟିଲା ଭାରତୀୟ ଚିକିତ୍ସା ଇତିହାସର ଏକ ବିରଳ ମୁହୂର୍ତ୍ତ। ଏକାଥରେ ଜନ୍ମନେଲେ ୪ଟି ଲକ୍ଷ୍ମୀ ❤️❤️❤️❤️
— SABYASACHI MISHRA 🇮🇳 (@sabyaactor) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ଆଉ ମୁଁ ହେଲି ମାମୁଁ 😍
A Big Thanks to Our Great Doctors & staffs at SCB Medical, Cuttack for the miracle.@smileplease_org #SmilePlease #SmileForce pic.twitter.com/5jAA4kmvZS
">ଓଡ଼ିଶାରେ ଘଟିଲା ଭାରତୀୟ ଚିକିତ୍ସା ଇତିହାସର ଏକ ବିରଳ ମୁହୂର୍ତ୍ତ। ଏକାଥରେ ଜନ୍ମନେଲେ ୪ଟି ଲକ୍ଷ୍ମୀ ❤️❤️❤️❤️
— SABYASACHI MISHRA 🇮🇳 (@sabyaactor) August 8, 2021
ଆଉ ମୁଁ ହେଲି ମାମୁଁ 😍
A Big Thanks to Our Great Doctors & staffs at SCB Medical, Cuttack for the miracle.@smileplease_org #SmilePlease #SmileForce pic.twitter.com/5jAA4kmvZSଓଡ଼ିଶାରେ ଘଟିଲା ଭାରତୀୟ ଚିକିତ୍ସା ଇତିହାସର ଏକ ବିରଳ ମୁହୂର୍ତ୍ତ। ଏକାଥରେ ଜନ୍ମନେଲେ ୪ଟି ଲକ୍ଷ୍ମୀ ❤️❤️❤️❤️
— SABYASACHI MISHRA 🇮🇳 (@sabyaactor) August 8, 2021
ଆଉ ମୁଁ ହେଲି ମାମୁଁ 😍
A Big Thanks to Our Great Doctors & staffs at SCB Medical, Cuttack for the miracle.@smileplease_org #SmilePlease #SmileForce pic.twitter.com/5jAA4kmvZS
ఇదీ చదవండి: ఒలింపిక్ వీరులకు పార్లమెంట్లో హర్షధ్వానాలు