ETV Bharat / bharat

తమిళనాట 20 స్థానాల్లో భాజపా పోటీ - తమిళనాట భాజపాకు 20 సీట్లు కేటాయింపు

తమిళనాడులో 20 అసెంబ్లీ సీట్లు సహా ఓ లోక్​సభ స్థానాన్ని భాజపాకు కేటాయించింది అధికార అన్నాడీఎంకే. పలుమార్లు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది అధికార పార్టీ.

AIADMK seals poll pact with BJP, gives Kanyakumari LS seat; 20 assembly segments
తమిళనాట భాజపాకు 20 సీట్లు కేటాయింపు
author img

By

Published : Mar 6, 2021, 10:45 AM IST

Updated : Mar 6, 2021, 12:16 PM IST

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, తన మిత్రపక్షం భాజపా మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. పలుమార్లు చర్చల అనంతరం.. కన్యాకుమారి లోక్​సభ స్థానం సహా 20 అసెంబ్లీ సీట్లను భాజపాకు కేటాయించింది అన్నాడీఎంకే. దీంతో కన్యాకుమారి స్థానానికి జరిగే ఉపఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి పొన్​ రాధాకృష్ణన్​ను​ తమ అభ్యర్థిగా ప్రకటించింది భాజపా.

ఆరుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసిన అన్నాడీఎంకే.. అనంతరం కమలం పార్టీ నేతలతో చర్చలు జరిపి 20 స్థానాలను కేటాయించింది. ఎన్నికల బరిలోకి దిగనున్న భాజపా అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుదని అధికార పార్టీ పేర్కొంది.

అన్నాడీఎంకే 2016లో గెలిచిన 134 స్థానాలు సహా మొత్తం 170 చోట్ల బరిలోకి దిగాలని చూస్తోంది.

అంతకుముందు మిత్రపక్షం పట్టాళి మక్కల్ కట్చి పార్టీకి 23 స్థానాలు కేటాయించింది అధికార అన్నాడీఎంకే.

ఇదీ చూడండి: డీఎంకే కూటమిలో సీపీఐకి 6 సీట్లు.. కాంగ్రెస్​పై అనిశ్చితి

Last Updated : Mar 6, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.