ETV Bharat / bharat

పళని స్వామికి మద్రాస్​ హైకోర్టు షాక్​, పన్నీర్​ వర్గం సంబరాలు - జయలలిత

AIADMK Judgement Today తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామికి పెద్ద షాక్​ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది మద్రాస్​ హైకోర్టు.

AIADMK Judgement Today
AIADMK Judgement Today
author img

By

Published : Aug 17, 2022, 2:17 PM IST

AIADMK Judgement Today: అన్నాడీఎంకేలో ఏకనాయకత్వ వ్యవహారంలో ఎడప్పాడి పళని స్వామికి మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వ విధానం కొనసాగించాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇదే సమయంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి ఎన్నిక చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. జులై 11న నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పన్నీర్‌ సెల్వంను పార్టీ పదవుల నుంచి తొలగించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీనిపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన పన్నీర్‌ సెల్వంకు ఊరట లభించింది. పార్టీ సమన్వయకర్తగా పన్నీర్‌సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి కొనసాగుతారని పన్నీర్‌ సెల్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారు. పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని దానికి పరిశీలకుడిని నియమించాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఉత్తర్వులతో పన్నీర్‌ సెల్వం వర్గీయులు సంబరాలు చేసుకున్నారు.

కొద్దిరోజుల క్రితం.. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ద్వంద్వ నాయకత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కో ఆర్డినేటర్‌, జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ పదవులను తొలగిస్తూ తీర్మారాన్ని ఆమోదించారు. దీంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకుంది పార్టీ. వెంటనే పన్నీర్​ సెల్వంను పార్టీ నుంచి తొలగించింది. పన్నీర్​సెల్వం ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడం సహా కోశాధికారి పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఆయన అనుచరులను సైతం బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నవారు ఓటేసి ప్రధాన కార్యదర్శిని తర్వాత ఎన్నుకోనున్నట్లు అప్పుడు పార్టీ పేర్కొంది. అప్పటివరకు పళనిస్వామి పార్టీ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వెల్లడించింది.

ఇది జరిగిన కొద్ది రోజులకే పన్నీర్​సెల్వం కుమారులు, మరో 16 మంది ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు ఎడప్పాడి పళనిస్వామి. పన్నీర్​ సెల్వం కుమారుల్లో ఒకరు రవీంద్రనాథ్​ తేని నియోజకవర్గం నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమారుడు జయప్రదీప్​, మాజీ మంత్రి ఎన్​ నటరాజన్​పైనా పార్టీ వేటు వేసింది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. వీరంతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని, అన్నాడీఎంకేకు చెడ్డ పేరు తెచ్చారని ఓ ప్రకటనలో తెలిపారు పళనిస్వామి.

ఆ సమావేశం నుంచే..: 2016లో అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణానంతరం.. ఆ పార్టీ ద్వంద్వ నాయకత్వ సూత్రాన్ని అనుసరిస్తోంది. అయితే పళనిస్వామి మాత్రం పార్టీలో ఏక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 14న జిల్లా కార్యదర్శి సమావేశం జరిగినప్పటి నుంచి పార్టీలో ఏక నాయకత్వం కోసం చర్చ మొదలైంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.

ఇవీ చూడండి: పన్నీర్​సెల్వంకు 'పళని' మరో షాక్​.. కుమారులు సహా వారంతా పార్టీ నుంచి ఔట్​

పన్నీర్​సెల్వంకు షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ.. పళనిస్వామికి పగ్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.