తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటుకు నోటు వ్యవహారం జోరుగా సాగుతోంది. అధికార అన్నాడీఎంకేకు చెందిన మైనారిటీ విభాగ నేత జేఎం బషీర్ శుక్రవారం ఒక్కో ఓటుకు రూ.500 చొప్పున పంచుతున్న వీడియో వైరల్గా మారింది. చెపాక్- ట్రిప్లికేన్ నియోజక వర్గంలో ఓటరు ఐడీలను పరిశీలించి, మహిళలకు ఆయన డబ్బులిచ్చారు.
చెపాక్-ట్రిప్లికేన్లో డీఎంకే నుంచి ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి బరిలో ఉన్నారు. అతనికి పోటీగా ఏఐఏడీఎంకే కూటమి భాగస్వామి పీఎంకే అభ్యర్థి నిలబడ్డారు. అంతకు ముందు అన్నాడీఎంకే మాజీ మంత్రి నాథమ్ విశ్వనాథన్ కూడాఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ఉన్న వీడియో కలకలం రేపింది. దానిపై దర్యాప్తునకు ఎన్నికల కమిషన్ వద్దకు పంపారు.
ఇదీ చూడండి: తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా?