ETV Bharat / bharat

పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం - మహారాష్ట్ర ప్రమాదం

Maharashtra Accident News: కంటైనర్​ ట్రక్కు.. ఆటోను ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జరిగింది.

Maharashtra Accident News:
Maharashtra Accident News:
author img

By

Published : May 6, 2022, 5:17 PM IST

Updated : May 6, 2022, 6:07 PM IST

Maharashtra Accident News: మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్​ ట్రక్కు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోపర్​గావ్​ సిటీ పోలీస్​ స్టేషన్ పరిధిలోని మసూద్​పుర్​ ఫాటా సమీపంలో 8 గంటలకు ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న కోపర్‌గావ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Maharashtra Accident News:
ప్రమాదానికి కారణమైన ట్రక్కు
Maharashtra Accident News:
ప్రమాద స్థలంలో పోలీసులు

ఇదీ జరిగింది: ఝాగ్దే నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోరిక్షాను.. కంటైనర్ ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలో ఇద్దరు కళాశాల విద్యార్థులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోపర్‌గావ్‌ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు.

Uttarpradesh Accident News: ఉత్తర్​ప్రదేశ్​ రాంపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజీమ్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను అస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

పెళ్లికి వెళ్తుండగా.. మురాదాబాద్​ జిల్లా వాసులు రాంపుర్​లోని ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి విద్యుత్​ స్తంభాన్ని, అనంతరం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. వాహనంలో మొత్తం 11 మంది ఉండగా.. వీరిలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. నలుగురు తీవ్రగాయాల పాలుకాగా, ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. మృతులను పరిధిలోని రహతా మాఫీ గ్రామానికి చెందిన వినీత్ (30), రాజేష్ (45), క్రషబ్ (28), ఆకాష్ సక్సేనా (29), వివేక్ చౌహాన్ (20), సౌరభ్ (31)లుగా గుర్తించారు.

ఇదీ చదవండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు హతం

Last Updated : May 6, 2022, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.