ETV Bharat / bharat

'అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు'లో దోషులుగా 49 మంది

Ahmedabad Bomb Blast Case: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 49 మందిని దోషులుగా తేల్చింది గుజరాత్​లోని ప్రత్యేక కోర్టు. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన కోర్టు మరో 28 మందిని నిర్దోషులుగా పేర్కొంది.

Ahmedabad Bomb Blast Case
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు
author img

By

Published : Feb 8, 2022, 3:30 PM IST

Ahmedabad Bomb Blast Case: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్​లోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో 49 మందిని దోషులుగా తేల్చింది. మరో 28 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు జడ్జి ఏఆర్ పటేల్ తీర్పునిచ్చారు. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన కోర్టు.. ఘటన జరిగిన 13 ఏళ్ల తర్వాత తీర్పును వెలువరించింది.

దోషులకు శిక్ష ఖరారు చేయడంపై బుధవారం నుంచి వాదనలు వింటామని స్పష్టం చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ), ఐపీసీ 302(హత్య), ఐపీసీ 120-బీ సెక్షన్​ల కింద 49 మంది నిందితులను దోషులుగా తేల్చినట్లు ప్రత్యేక కోర్టు న్యాయవాది అమిత్ పటేల్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై మొత్తం 547 ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయని, ఈ కేసులో భాగంగా 1,163మంది ప్రత్యక్ష సాక్షులను విచారించినట్లు తెలిపారు. నిందితులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నట్లు వివరించారు.

2008, జులై 26న అహ్మదాబాద్​లో 70 నిమిషాల వ్యవధిలోనే 21 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 56 మంది మృతిచెందగా దాదాపు 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం)కు చెందినవారే ఈ దాడులకు కారణమని పోలీసులు నిర్ధరించారు.

ఇదీ చూడండి: 'కుటుంబ పార్టీలతో భారత ప్రజాస్వామ్యానికి ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.