ETV Bharat / bharat

అగ్నిపథ్​పై నిరసనలతో టెన్షన్​ టెన్షన్​.. భద్రత కట్టుదిట్టం.. రైళ్లు రద్దు - Agnipath scheme protest reason

agnipath-protests-railways-says-200-train-affected-so-far-35-cancelled

author img

By

Published : Jun 17, 2022, 2:07 PM IST

13:35 June 17

అగ్నిపథ్​పై నిరసనలతో టెన్షన్​ టెన్షన్​.. భద్రత కట్టుదిట్టం.. రైళ్లు రద్దు

Agnipath Protests: సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 'అగ్నిపథ్​' పథకంపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. పాత పద్ధతిలోనే సైన్యం నియామక ప్రక్రియ చేపట్టాలని పెద్ద ఎత్తున యువత రోడ్డెక్కింది. పలు చోట్ల నిరుద్యోగుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, తెలంగాణలోని సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటగా.. రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించింది.

అగ్నిపథ్​పై నిరసనలతో మొత్తం 200 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని భారతీయ రైల్వే ప్రకటించింది. సుమారు 35 ట్రైన్లను రద్దు చేయగా.. మరో 13 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. ఆందోళనలు అధికంగా ఉన్న బిహార్​, ఝార్ఖండ్​ సహా ఉత్తర్​ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల పరిధిలో ఉండే తూర్పు మధ్య రైల్వే అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడే చాలా రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలించి.. రైళ్లను షెడ్యూల్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు.

భద్రతా కారణాల రీత్యా.. హరియాణా గురుగ్రామ్​ జిల్లాలో 144 సెక్షన్​ విధించినట్లు అధికార యంత్రాగం స్పష్టం చేసింది. ఆల్​ ఇండియా స్టూడెంట్స్​ అసోసియేషన్​కు చెందిన కొందరు సభ్యులు ఆందోళనలు చేయగా.. దిల్లీ ఐటీఓ మెట్రో స్టేషన్​ అన్ని గేట్లు మూసివేశారు. జామా మసీద్​, దిల్లీ గేట్​ మెట్రో స్టేషన్ల వద్ద కూడా ఆంక్షలు విధించారు అధికారులు. పలు రాష్ట్రాల్లోనూ మెట్రో సర్వీసులు రద్దయ్యాయి.

ఇవీ చూడండి: ''అగ్నిపథ్​'తో వారికి ఎలాంటి నష్టం లేదు'.. కేంద్రం క్లారిటీ

'అగ్నిపథ్​'పై ఆగని నిరసనల హోరు.. పలు చోట్ల రైళ్లకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.