ETV Bharat / bharat

రాహుల్​కు మరో షాక్​.. ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​ ఖాతాపై! - రాహుల్​ వివాదాస్పద పోస్ట

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్​స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని ఫేస్​బుక్​ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్​సీపీసీఆర్‌)​ ఆదేశించింది. దిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యుల వివరాలు బహిర్గతమయ్యేలా.. ఆయన పోస్ట్ చేసినందుకుగాను ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పింది.

rahul in instagram
రాహుల్​ ఇన్​స్టాగ్రామ్​ ఖాతా
author img

By

Published : Aug 13, 2021, 3:25 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్ ఇచ్చింది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్​సీపీసీఆర్‌). రాహుల్​ గాంధీ ఇన్​స్టాగ్రామ్ ప్రొఫైల్​పై చర్యలు తీసుకోవాలని ఫేస్​బుక్​ను ఆదేశించింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక కుటుంబ వివరాలను బహిరంగపరిచేలా ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఫేస్​బుక్​కు ఎన్​సీపీసీఆర్​ ఓ లేఖ రాసింది.

"ఇన్​స్టాగ్రామ్​లో రాహుల్​ పోస్టు చేసిన ఓ వీడియోలో.. బాధిత బాలిక కుటుంబాన్ని గుర్తించేలా ఉంది. ఆ వీడియోలో బాలికతో పాటు ఆమె తల్లితండ్రులు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇది నిర్దేశించిన చట్టాలను ఉల్లంఘించడమే. జువైనల్​ జస్టిస్​ యాక్ట్​-2015, పోక్సో చట్టం-2012, ఐపీసీలోని నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ఆయన ఖాతాపై చర్యలు తీసుకోవాలి. సదరు వీడియోను వెంటనే తొలగించాలి."

-ఫేస్​బుక్​కు రాసిన లేఖలో ఎన్​సీపీసీఆర్​

దిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను గత వారం కలిసిన రాహుల్​.. సంబంధిత ఫొటోను​ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్ చేశారు. దాంతో స్పందించిన ఎన్​సీపీసీఆర్​.. ఆ ట్వీట్​పై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​కు నోటీసులు పంపించింది. అందుకు అనుగుణంగా ఆయన ఖాతాను బ్లాక్ చేసింది ట్విట్టర్.

ఇదీ చూడండి: 'ట్విట్టర్​ రాజకీయం'లో కొత్త ట్విస్ట్​- ఇక కాంగ్రెస్​తో...

ఇదీ చూడండి: కాంగ్రెస్​ ట్విట్టర్​ ఖాతా బ్లాక్​- అసలు కారణమేంటి?

ఇదీ చూడండి: 'ట్విట్టర్ పక్షపాతం- సర్కారు చెప్పిందే వేదం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.