ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి 10 నూతన డ్రోన్లను కొనేందుకు కేంద్రం అంగీకరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నిఘా సామర్థ్యాలను విస్తరించేందుకు నావికా దళానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తాయి.
"భారత నావికాదళ అభ్యర్థన రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఈ మానవ రహిత వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బై గ్లోబల్ కేటగిరీ కింద నేవీ ఓపెన్ బిడ్ ద్వారా ఈ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. "వీటిని సముద్రజాలల్లో నిఘా కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా చైనీయుల కార్యకలాపాలతో పాటు ఇతరుల కదలికలు గుర్తించడంలో సహకరిస్తాయి" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట!