ETV Bharat / bharat

ఎంగేజ్​మెంట్ క్యాన్సిల్​ అయ్యిందని కోపం పెంచుకుని.. తల్లితో వెళ్తుండగా చంపేసి.. - బిహార్​లో వివాహేతర సంబంధం

Teen Stabbed : యువతితో తన నిశ్చితార్థం క్యాన్సిల్​ అయ్యిందనే కారణంతో ఆమెను హతమార్చాడు ఓ యువకుడు. హరియాణాలో ఈ దారుణం జరిగింది. మరోవైపు ఏడో తరగతి చదువుతున్న ఓ బాలుడు తోటి స్నేహితుడిని కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన బిహార్​లో వెలుగుచూసింది.

Bihar Haryana Chandigarh Crime News
ఎంగేజ్​మెంట్ క్యాన్సిల్​ అయ్యిందని కోపం పెంచుకున్నాడు.. అదును చూసి యువతిని చంపేశాడు
author img

By

Published : Jul 10, 2023, 10:20 PM IST

Teen Stabbed : హరియాణాలోని చండీగఢ్‌లో ఓ యువకుడు పట్టపగలే రెచ్చిపోయాడు. యువతితో తన నిశ్చితార్థం రద్దయ్యిందన్న ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్​కు చెందిన నేహా(19) అనే యువతికి నాలుగు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌(23) అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే పలు కారణాల వల్ల వీరి వివాహం రద్దు అయ్యింది. ఇదంతా మనసులో పెట్టుకున్న రాజ్‌కుమార్​ యువతిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.

యువతి తన తల్లితో కలిసి సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గురుగ్రామ్​లోని మోలహేరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే రాజ్​కుమార్ ​​వారిని అడ్డగించి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అదును కోసం చూసిన అతడు వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడికి దిగాడు. నేహాను కత్తితో పలుమార్లు పొడిచాడు. పక్కనే ఉన్న తల్లి ప్రతిఘటించి బిడ్డను రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.

అక్కడే ఉన్నా.. చోద్యం చూశారు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఘటనాస్థలిలో చాలా మంది ఉన్నా.. ఎవరూ నిందితుడిని అడ్డుకోకపోవడం గమనార్హం. వారంతా పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి. నిందితుడు రాజ్​కుమార్​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వివాహితతో ప్రేమాయణం.. యువకుడి హత్య..!
బిహార్​.. పూర్ణియా జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురై తోటలో అనుమానస్పదస్థితిలో కనిపించాడు. మృతుడిని జిల్లాలోని ఛప్రైలీ గ్రామానికి చెందిన అక్బర్ ఆలమ్‌గా గుర్తించారు పోలీసులు. ఓ వివాహితతో అక్బర్​ వివాహేతర సంబంధం కొనసాగించేవాడని.. వారిద్దరూ తరచూ కలసుకునే వారని, ఫోన్​లో కూడా మాట్లాడుకునేవారని బంధువులు చెబుతున్నారు. ఈ విషయం మహిళ భర్తకు తెలియడం వల్ల అతడే యువకుడిని చంపి తోటలో పడేసి ఉంటాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే మహిళతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

స్నేహితుల మధ్య ఘర్షణ.. విద్యార్థి మృతి..!
బిహార్​లోని సివాన్​ జిల్లాలో ఏడో తరగతి చదువుతున్న ఓ మైనర్​ విద్యార్థి తన తోటి స్నేహితుడిని అత్యంత దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఏదో విషయంలో ఇద్దరు విద్యార్థులు గొడవకు దిగారని.. ఈ క్రమంలోని ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్రంగా కొట్టుకున్నారని సహ విద్యార్థులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం బాలుడిని ఆస్పత్రికి తరలించింది. అప్పటికే అతడు మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల ప్రిన్సిపల్​తో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని రాంపుర్ గ్రామానికి చెందిన గుడ్డు సింగ్ కుమారుడు పంకజ్ కుమార్ సింగ్​గా గుర్తించారు పోలీసులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.