కరోనా వ్యాప్తిని సూచించే ఆర్- ఫ్యాక్టర్ మరోసారి పెరిగినట్లు పరిశోధకలు హెచ్చరించారు. ఆగస్టు 14-17 తేదీల మధ్య 0.89గా ఉన్న ఆర్-ఫ్యాక్టర్.. నెలఖరుకు 1.17కు పెరిగిందని తెలిపారు. ప్రధానంగా.. కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు ఆర్-ఫ్యాక్టర్ (covid 19 r value) మీద ప్రభావం చూపించాయని పేర్కొన్నారు.
" ఆగస్టు నెలాఖరుకు పరిస్థితి ఆందోళకరంగా మారింది. ఆర్-ఫ్యాక్టర్ 1.2కి చేరువలోకి వచ్చింది. ఇదివరకు థర్డ్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఈ సంఖ్య 1.03గా ఉంది. కేరళ, మహారాష్ట్ర, మిజోరం, జమ్ముకశ్మీర్‌లలో కరోనా వ్యాప్తి ఆర్-ఫ్యాక్టర్ పెరుగుదలపై ప్రభావం చూపిస్తోంది."
-సితాభ్ర సిన్హా, పరిశోధకులు
కేరళ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఆర్-ఫ్యాక్టర్ సంఖ్య ఆందోళకర స్థాయిలో ఉంది. కేరళలో 1.33, మిజోరంలో 1.36, జమ్ముకశ్మీర్ 1.25, మహారాష్ట్ర 1.06 సహా ఆంధ్రప్రదేశ్‌లో 1.09గా ఆర్-ఫ్యాక్టర్ నమోదైంది.
దేశంలో మార్చి నుంచి మే నెల మధ్య ఆర్- ఫ్యాక్టర్ అత్యధిక సంఖ్య నమోదైంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 21 మధ్య ఈ సంఖ్య 1.37గా ఉంది.
ఇదీ చదవండి : covid variant mu: భారత్‌లో 'మ్యూ' భయాలు- కొత్త వైరస్ ప్రమాదకరమా?