ETV Bharat / bharat

నాటుసారా తాగిన 24 ఏనుగులు.. ఆదమరచి నిద్ర.. డప్పులు కొట్టి శబ్దం చేయగానే.. - odisha elephants drank liquid

ఒడిశాలో ఓ ఏనుగుల మంద తోటలో పులియబెట్టిన సారా తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాయి. గాఢంగా నిద్రిస్తున్న ఆ గజరాజులను అటవీశాఖ అధికారులు నిద్ర లేపి తిరిగి అడవికి తరలించారు.

elephants got drunk by mahua liquor in odisha
elephants got drunk by mahua liquor
author img

By

Published : Nov 9, 2022, 9:47 PM IST

అడవిలో పులియబెట్టిన సారా తాగిన ఏనుగుల మంద ఆ మత్తులో తూలుతూ అలాగే నిద్రించిన ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగింది. సారా కోసం పానీయాన్ని సిద్ధం చేసేందుకు వచ్చిన గ్రామస్థులు ఏనుగులను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా.. గజరాజులు ఎంతకీ లేవలేదు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిచారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎట్టకేలకు వాటికి అడవిలోకి పంపించారు.

ఒడిశా అడవుల్లో దొరికే 'మహువా' అనే ఓ అరుదైన పువ్వును పులియబెడితే వచ్చే రసాయనంతో నాటుసారా తయారు చేస్తారు. ఈ క్రమంలో శిలిపాడలోని గ్రామ ప్రజలు 'మహూవా' అనే ఈ సాంప్రదాయ మద్యపానీయాన్ని తయారు చేసేందుకు దగ్గర్లో ఉన్న ఓ జీడిపప్పు తోటలో మద్యానికి కావాల్సిన వస్తువులును సేకరించి ఆ పానీయాన్ని పులియబెట్టారు.

అయితే ఆ తోటలో పులియబెట్టిన రసాయనాన్ని ఏదో పానీయం అనుకుని భావించిన ఆ గజరాజు బృందం దాన్ని గటాగటా తాగేశాయి. అలా తాగిన మత్తుతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆ ఏనుగుల మంద అక్కడే నిద్రించాయి. ఈ క్రమంలో గ్రామస్థులు పానీయాన్ని సిద్ధం చేయడానికి తోటకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడున్న కుండలన్నీ పగిలిపోయి ఉన్నాయి. సమీపంలోనే గజరాజులు ఆదమరిచి నిద్రిస్తూ ఉన్నాయి. దీంతో గజరాజులే కుండలను పగులగొట్టి.. ఆ పానీయాన్ని తాగేశాయని గ్రామస్థులు గుర్తించారు.

దీంతో, నిద్రిస్తున్న ఏనుగులను లేపేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. ఎంత కదిలించినా ఏనుగుల ఉలుకూపలుకూ లేదు. దీంతో వారు అటవీ శాఖకు సమాచారం అందించారు.​ అధికారులు వచ్చి.. ఏనుగులను నిద్రలేపేందుకు ప్రయత్నించారు. డప్పులు కొట్టి శబ్దం చేయగా.. అవి లేచి అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల మందలో.. తొమ్మిది మగ, ఆరు ఆడ, తొమ్మిది పిల్ల ఏనుగులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:కాపీ కొట్టాడని విద్యార్థిపై ఫిర్యాదు.. 14వ అంతస్తు నుంచి దూకి బాలుడు ఆత్మహత్య

పరుగు పందెం గెలిచి.. వైకల్యాన్ని ఓడించిన విద్యార్థి.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.