అసోం సోనిత్పుర్లో మరో ఆరు సార్లు భూమి కంపించింది. బుధవారం 6.4 తీవ్రతతో భారీగా భూమి కంపించిన ఘటన మరవక ముందే ఇక్కడ పలుమార్లు భూకంపం సంభవించింది.
గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతతో సోనిత్పుర్లో భూమి వణికిందని జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆరుసార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు స్పష్టం చేసింది.
రాత్రి 12 గంటల నుంచి.. 2.6, 2.9, 4.6, 2.7, 2.3 తీవ్రతలతో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. సోనిత్పుర్లో మొత్తంగా 10 భూకంపాలు వచ్చినట్లు తెలిపింది.
ఇదీ చదవండి:'బెయిల్ లభించిన వారి హక్కులకు భంగం కలిగించొద్దు'