ETV Bharat / bharat

30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి

ఒడిశాలో ఓ మెుసలి అరుదైన ఘనత సాధించింది. సుమారు 30 ఏళ్ల తర్వాత.. మరోసారి 28 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ మొసలి పిల్లలన్నింటినీ సహజ వాతావరణంలోనే పెంచుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

Gharial, Crocodile
మొసలి, ఘేరియల్​
author img

By

Published : May 24, 2021, 11:51 AM IST

Updated : May 24, 2021, 12:04 PM IST

ఒడిశా- అంగుల్​ జిల్లాలోని సాట్కోసియా వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో ఓ మొసలి చరిత్ర సృష్టించింది. అక్కడి అభయారణ్యంలోని ఘేరియల్​(చేపలను ఆహారంగా తీసుకునేది) జాతికి చెందిన ఓ మెుసలి సుమారు 30ఏళ్ల తర్వాత.. ఏకంగా 28 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానిక ఫారెస్ట్​ చీఫ్​ రేంజర్​ ప్రదీప్​రాజ్​ కరాటే వెల్లడించారు.

Gharial, Crocodile
ఘేరియల్
Gharial, Gharial babies
నీటిపై తేలియాడుతున్న మొసలి పిల్లలు
Gharial with babies
పిల్లలతో ఘేరియల్​

మహానది సాట్కోసియాలో నివాసముండే ఘేరియన్​ 30 ఏళ్ల తర్వాత.. మరోసారి ఇలా 28 పిల్లలకు జన్మనిచ్చిందని ప్రదీప్​రాజ్​ చెప్పారు. ఫలితంగా.. మూడు దశాబ్దాల అనంతరం.. ఘేరియల్​ తన గుర్తింపును తిరిగి పొందిందన్నారు. సంబంధిత దృశ్యాలను అటవీ శాఖ విడుదల చేసింది. సాట్కోసియాలోని సహజ వాతావరణంలో వీటిని పోషిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : వ్యాక్సిన్ వద్దని నదిలో దూకి పరార్​!

Last Updated : May 24, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.