ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల్లో కేంద్ర బలగాల పరిధి కుదింపు

AFSPA states: ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పరిధిపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా తెలిపారు.

afspa states
సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం
author img

By

Published : Mar 31, 2022, 3:03 PM IST

Updated : Mar 31, 2022, 5:28 PM IST

AFSPA states: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్​ఎస్​పీఏ) పరిధిలోని కల్లోలిత ప్రాంతాలను కుదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్దాల తర్వాత నాగాలాండ్​, అసోం, మణిపుర్​ రాష్ట్రాల్లో ఏఎఫ్​ఎస్​పీఏ పరిధిని తగ్గిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా తెలిపారు. అయితే ఏఎఫ్​ఎస్​పీఏ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయలేదని, పలు ప్రాంతాల్లో కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వరుస ట్వీట్లు చేశారు షా.

afspa states
అమిత్​ షా ట్వీట్లు

" దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ తరుణంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, చొరబాట్లకు ముగింపు పలికేందుకు పీఎం మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతోంది. వాటి ఫలితమే ఏఎఫ్​ఎస్​పీఏ పరిధిలోని ప్రాంతాల కుదింపు. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాట్లను అణిచివేసేందుకు సైన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు కల్పించింది. అయితే ఈ చట్టాన్ని సైన్యం దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఏఎఫ్​ఎస్​పీఏ పరిధిలోని కల్లోలిత ప్రాంతాలను పూర్తి స్థాయిలో.. త్రిపురలో 2015, మేఘాలయలో 2018లో తొలగించింది కేంద్రం. 1990 నుంచి అసోంలో ఈ చట్టాన్ని అమలు చేశారు. అయితే.. పరిస్థితులు మెరుగుపడుతున్న క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్​ 1 నుంచి 23 జిల్లాల్లో పూర్తిస్థాయిలో, ఒక జిల్లాలో పాక్షికంగా తొలగిస్తున్నారు. మణిపుర్​లో ఇంపాల్​ మున్సిపాలిటీ ప్రాంతం మినహా మిగతా వాటిల్లో 2004 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. గురువారం తీసుకున్న నిర్ణయంతో ఆరు జిల్లాల్లోని 15 పోలీస్​ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను ఈ చట్టం పరిధిని నుంచి తొలగిస్తున్నారు. నాగాలాండ్​లో 7 జిల్లాల్లోని 15 పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని ఎత్తివేస్తున్నారు.

ఇదీ చూడండి: 75 ఏళ్ల సూపర్ ఉమన్​.. 10వేల కిలోమీటర్లు సైకిల్​పైనే సవారీ

Last Updated : Mar 31, 2022, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.