దేశ రాజధాని దిల్లీలోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(UNHCR delhi) కార్యాలయం వద్ద.. భారత్‌లో ఉన్న అఫ్గానిస్థాన్ వలసదారులు(afghan refugees in india) నిరసన ప్రదర్శన చేపట్టారు. అఫ్గాన్ వాసులందరికి శరణార్థుల హోదా లేదా కార్డు ఇవ్వాలని, ఐరాస హైకమిషనరే తమకు భద్రత కల్పించాలని కోరారు. మహిళలు, పిల్లలతో సహా యూఎన్‌హెచ్‌సీఆర్‌కు చేరిన అఫ్గాన్ వాసులు 'మాకు భవిష్యత్తు కావాలి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
"మూడు డిమాండ్లు తీర్చాలని కోరుతూ మేం ఇక్కడ నిరసన చేపట్టాం. భారత్‌లో లాంగ్ టర్మ్ వీసా పొందేందుకు శరణార్థుల హోదా ఇవ్వాలి. మెరుగైన అవకాశాల కోసం అఫ్గాన్లు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు మద్దతుగా లేఖలు విడుదల చేయాలి. భారత్, యూఎన్హెచ్ఆర్సీ నుంచి పూర్తి స్థాయి భద్రత మాకు లభించాలి. ఉద్యోగం, చదువు వంటి అవకాశాలు లేక మేం సతమతమవుతున్నాం."
--అహ్మద్ జియా ఘని, భారత్‌లోని అఫ్గాన్ కమ్యూనిటీ అధ్యక్షుడు.
21,000 మంది అఫ్గాన్ వలసదారుల్లో 13వేల మంది వద్ద డాక్యుమెంట్లు లేవని, ఉద్యోగం కోసం వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జియా తెలిపారు. అయితే.. చాలా కాలం నుంచి తాము భారత్‌లోనే నివసిస్తున్నట్లు కొందరు విద్యార్థులు(Afghan refugees in india) చెప్పారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు అక్కడే ఇరుక్కుపోయారని కొందరు వాపోయారు. చాలా మంది తమ కుటుంబసభ్యులను కోల్పోయినట్లు తెలిపారు. అయితే.. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాము అఫ్గాన్ తిరిగి వెళ్లమని చెబుతూ.. వారికి రెఫ్యూజీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో.. అఫ్గాన్ శరణార్థులకు తమ మద్దతును పెంచుతున్నట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(UNHCR india) పేర్కొంది. రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ ద్వారా పునరావాసం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
ఇదీ చదవండి: