ETV Bharat / bharat

యోగి హెలికాప్టర్​ను ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్​ - యోగి ఆదిత్యనాథ్​ హెలికాప్టర్ ప్రమాదం

yogi adityanath news: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​కు ప్రమాదం తప్పింది. ఆయన వారాణాసి నుంచి లఖ్​నవూకు వెళ్తుండగా.. పక్షి ఢీకొట్టింది. దీంతో అత్యవసరంగా ల్యాండ్​ చేశారు.

yogi adityanath news
yogi adityanath news
author img

By

Published : Jun 26, 2022, 11:00 AM IST

Updated : Jun 26, 2022, 12:00 PM IST

yogi adityanath news: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన వారాణాసి నుంచి లఖ్​నవూకు వెళుతుండగా ఓ పక్షి హెలికాప్టర్​ను ఢీకొట్టింది. దీంతో టేకాఫ్​ అయిన నాలుగు నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో ఉంచుకునే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్​ కౌషల్​రాజ్​ శర్మ తెలిపారు. ల్యాండ్​ చేసిన అనంతరం యోగి సర్కూట్​ హౌస్​లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత బబత్​పుర్​ విమానాశ్రయం నుంచి విమాన మార్గంలో లఖ్​నవూ వెళ్లనున్నారు.

yogi adityanath news
అత్యవసరంగా ల్యాండ్​ చేసిన ముఖ్యమంత్రి యోగి హెలికాప్టర్​

రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం వారాణాసి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు చేసిన యోగి.. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం అభివృద్ధి పనులను పర్యవేక్షించి 9 గంటలకు లఖ్​నవూకు తిరుగు ప్రయాణం అయ్యారు. టేకాఫ్​ అయిన నాలుగు నిమిషాలకే హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్​ అయ్యింది. ముఖ్యమంత్రి హెలికాప్టర్​కు పెను ప్రమాదం తప్పడం వల్ల అధికార యంత్రాంగమంతా ఊపిరి పీల్చుకుంది.

ఇదీ చదవండి: ఫడణవీస్​తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!

Last Updated : Jun 26, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.