ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రెండు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi yogi photo).. యోగి భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించారు.


అసెంబ్లీ ఎన్నికలు(up elections 2022) సమీపిస్తున్న తరుణంలో.. ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం రాత్రి నుంచి లఖ్‌నవూలోని రాజ్‌భవన్‌లో బస చేస్తున్నారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి యోగి ఆయన్ను కలిశారు. అప్పుడే రాజ్‌భవన్‌లోని ప్రాంగణంలో మోదీ-యోగి మాటల్లో మునిగిపోయారు. ఈ సమయంలోనే మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. 'నవ భారత్' అని క్యాప్షన్ జోడించారు యోగి.
యోగి ట్వీట్‌ను రిట్వీట్ చేశారు ఉత్తర్‌ప్రదేశ్ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్. 'సమగ్ర విజయంవైపు అడుగులు వేస్తూ..' అని క్యాప్షన్ రాసుకొచ్చారు(modi latest news).
ఎస్పీ ఎద్దేవా...
ఈ ఫొటోలపై విపక్ష సమాజవాది పార్టీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 'మనల్ని చూస్తున్న ప్రపంచం కోసం రాజకీయాల్లో కొన్నిసార్లు ఇలా చేయకతప్పదు. ఇష్టం లేకపోయినా, భుజాలపై చేతులు వేసి కొన్ని అడుగులు వేయకతప్పదు,' అంటూ హిందీలో ట్వీట్ చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.
ఇదీ చూడండి:- యూపీపై భాజపా ప్రత్యేక కసరత్తు- షా, రాజ్‌నాథ్‌కు బాధ్యతలు